Beard: పురుషులకు గడ్డం ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయాల్సిందే?
చాలామంది పురుషులు వయసు వచ్చినా కూడా గడ్డం రాలేదని బాధపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరికి మాత్రం చిన్న వయసులోనే గడ్డం బాగా గుబురు
- By Nakshatra Published Date - 09:02 PM, Tue - 8 August 23
చాలామంది పురుషులు వయసు వచ్చినా కూడా గడ్డం రాలేదని బాధపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరికి మాత్రం చిన్న వయసులోనే గడ్డం బాగా గుబురుగా గడ్డం వస్తూ ఉంటుంది. అయితే గడ్డం రావడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్రీడ్ ఆయిల్స్, క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయినప్పటికీ గడ్డం రాలేదని బాధపడుతూ ఉంటారు. అయితే మరి గడ్డం రావడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మందమైన గడ్డం విషయంలో మీ జన్యువులు కూడా కీ రోల్ పోషిస్తాయి. మీ కుటుంబంలో ఎవరికైనా, తాత, తండ్రులకి మందపాటి గడ్డం ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీ శరీరంలోని 5 ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఆండ్రోజెన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ని డైహైడ్రోటెస్టోస్టెరాన్ అని పిలిచే మరో హార్మోన్‌గా మారుస్తుంది. అలాగే బలమైన, మందపాటి గడ్డం జుట్టు పెరుగుదలలో వయస్సు కూడా ఒక ముఖ్య అంశం అని చేపవచ్చు. 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారికి మగవారికి ముఖం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, 20 నుంచి 30 ఏళ్ళ మధ్య పెరిగే వెంట్రుకల కాస్తా పల్చగా ఉంటాయి. దీని మందం వయస్సుతో పెరుగుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు కూడా గడ్డం పెరగకుండా చేస్తాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్న వారికి గడ్డం పెరగదు.
ఏదైనా ఇతర కారణాల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు వైద్యపరంగా తక్కువగా ఉంటే, అది జుట్టు పెరుగుదలని ఎఫెక్ట్ చేయదు. మరి గడ్డం బాగా పెరగడానికి మార్కటెల్లో చాలా ఖరీదైన నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొని వాడడం మాత్రమే కాదు. కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. పోషకాలు ఎక్కువగా ఉండే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల తల జుట్టే కాదు. గడ్డం కూడా రాలిపోతుంది. తగినంత నిద్ర అవసరం. మంచి నిద్ర అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సిగరెట్ తాగడాన్ని కూడా తగ్గించాలి.
Tags
Related News
Hirsutism: స్త్రీల ముఖంపై గడ్డం, మీసాలు కనిపించడానికి గల కారణాలివే..?
ప్రాచీ ముఖంపై మీసాలు కనిపించటంతోనే కొందరు నెటిజన్లు తనను ట్రోల్ చేశారని ప్రాచీ చెప్పింది. ఆమె ర్యాంకర్‌గా నిలిచిన విషయాన్ని పక్కనబెట్టి ఆమె మీసాలపై కామెంట్లు చేశారు.