Dry Skin: డ్రై స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి?
సాధారణంగా చాలామంది పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యి అనేక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి
- By Anshu Published Date - 10:39 PM, Thu - 14 September 23

సాధారణంగా చాలామంది పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యి అనేక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వివిధ కారణాల వల్ల మన చర్మం పొడిబారుతుంది. వీటిలో ముఖ్యమైనది శరీరానికి తగినంత నీరు లభించకపోవడమే. శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల చర్మం పొడిబారి పెళుసుగా మారుతుంది. అలాగే దీనివల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. నీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. మరిప్పుడు చర్మం ఉన్నవారు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పొడి చర్మం ఉన్నవారు ఖచ్చితంగా రోజుకు కనీసం రెండుసార్లైనా మాయిశ్చరైజర్ ను వాడాలి. ఎందుకంటే ఇది మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందుకోసం పొడిబారిన చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ నే వాడాలి. పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా పొడి చర్మం ఉన్నవారు నీటిని బాగా తాగాలి. శరీరానికి సరిపడా నీరు అందకపోవడం వల్లే చర్మం పొడిబారుతుంది. నీటిని పుష్కలంగా తాగడం వల్ల మీ చర్మం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా మీ ఆరోగ్యంగా, తాజాగా కూడా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు కొన్ని పండ్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా కీరదోసకాయలు, పుచ్చకాయలు, ద్రాక్షలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను తినాలి. ఎందుకంటే ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తాయి.
పొడిబారడాన్ని తగ్గిస్తాయి. పొడి చర్మం ఉన్నవారికి పొడి పెదవులు కూడా పొడిబారుతాయి. దీనివల్ల పెదాలు పగిలి అందులోంచి రక్తం వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వారు పెదాలకు రెగ్యులర్ గా లిప్ బామ్ ను అప్లై చేయాలి. లేదా కొబ్బరినూనెను కూడా పెట్టవచ్చు. పొడి చర్మం ఉన్నవారు శరీరానికి నూనె రాసి మసాజ్ చేయవచ్చు. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. నూనె మసాజ్ ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పొడి చర్మం ఉన్నవారు ఇంట్లో ప్రయత్నించే కొన్ని ఫేస్ ప్యాక్ లు కూడా ఉన్నాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ గంధం పొడిని ఒక టీస్పూన్ కలబంద రసంలో కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది