Packs Get Rid of Dandruff: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే?
మామూలుగా చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొందరు ఎక్కువగా శీతాకాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది
- By Nakshatra Published Date - 04:00 PM, Sat - 9 December 23
మామూలుగా చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొందరు ఎక్కువగా శీతాకాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రును తగ్గించుకోవడం కోసం రకరకాల చిట్కాలను రకరకాల షాంపులను హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. చలికాలంలో చలిగాలుల కారణంగా చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. దీంతో చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. చలికాలం వేధించే చుండ్రు సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని హెయిర్ ప్యాక్స్ సహాయపడతాయి. ఇంతకీ ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటి అన్న విషయానికి వస్తే..
చుండ్రుకి కారణమయ్యే ఫంగస్‌ని తగ్గించడానికి మెంతులు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మెంతులలోని బయోటిన్, విటమిన్ ఎ, బి, సి లు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే, మందారంలోని యాస్ట్రిజెంట్ లక్షణాలు జిడ్డు తత్వాన్ని, దురదను తగ్గించి చుండ్రు సమస్యకు చెక్ పెడతాయి. ఇందుకోసం మెంతి గింజల్ని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం గుప్పెడు మందార ఆకులు చేర్చి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కురుల చివర్ల వరకు రాసి ఆరాక గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా తప్పు కలగందా గుజ్జులో రెండు చెంచాల పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంటి తర్వాత తల స్నానం చేయాలి.
ఈ ప్యాక్ మీద ట్రై చేస్తూ ఉండటం వల్ల చుండ్రు సమస్యకు పూర్తిగా పెట్టవచ్చు. అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి కొనల వరకు పట్టించే బాగా మసాజ్ చేసి అరగంట పాటు ఉంచుకోవాలి. తర్వాత గాఢత తక్కువగా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్య పూర్తిగా దూరం అవుతుంది. గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణ అందిస్తుంది. ఇది చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్ స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొన ఈ మూడింటినీ ఒక బౌల్లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకొని ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా చుండ్రు సమస్య దూరం అవుతుంది.
Related News
Hair Tips: వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు చుండ్రు సమస్య మళ్ళీ రమ్మన్నా రాదు!
ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ