HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Are The Reasons Why You Are Getting Hungry After Eating

Hungry Stomach : కడుపునిండా తిన్నా.. మళ్లీ ఆకలిగా ఉంటోందా ? అయితే ఇవి కారణం కావొచ్చు..

నేటి జీవనశైలిలో.. దాదాపు అందరూ ఏదొక అనారోగ్యానికి మందులు వాడుతున్నారు. కొన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతాయి. మందుల వల్ల కూడా మీ ఆకలి పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, యాంటీ హిస్టామైన్లు, స్టెరాయిడ్స్ ఆకలిని పెంచుతాయి.

  • Author : News Desk Date : 29-04-2024 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Foods Avoid Empty Stomach
Foods Avoid Empty Stomach

Hungry Stomach : ఆకలి.. శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు ఆకలివేసినప్పుడల్లా ఏదొకటి తింటూ ఉంటాం. ఆహారం.. శరీరానికి శక్తినిచ్చే ఇంధనం. అయితే.. కొందరికి ఆహారం తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తూ ఉంటుంది. దీనికి కొన్ని కారణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని వ్యాధుల కారణంగా కూడా ఇలా అనిపించవచ్చు.

నేటి జీవనశైలిలో.. దాదాపు అందరూ ఏదొక అనారోగ్యానికి మందులు వాడుతున్నారు. కొన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతాయి. మందుల వల్ల కూడా మీ ఆకలి పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, యాంటీ హిస్టామైన్లు, స్టెరాయిడ్స్ ఆకలిని పెంచుతాయి.

అలాగే నిద్రలేమి కూడా అధిక ఆకలికి కారణం కావచ్చు. శరీరానికి కావలసినంత రెస్ట్ దొరికేది నిద్రలోనే. కాబట్టి.. రాత్రివేళ సరిగ్గా నిద్రపోకపోయినా.. ఎక్కువ ఆకలికి దారితీస్తుంది.

ఒత్తిడి కూడా శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఒత్తిడికి గురైనపుడు శరీరంలో హార్మోన్ స్థాయిలు మారడంతో ఆకలి పెరుగుతుంది.

అలాగే.. షుగర్ ఉన్నవారికి కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గినపుడు.. ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అందుకో షుగర్ లెవల్స్ తగ్గకుండా ఉండే ఆహారాలని ఎంచుకుని తినాలి. హైపర్ థైరాయిడిజం, హైపోగ్లైసీమియా కూడా ఆకలిని పెంచుతాయి.

సెక్స్ హార్మోన్లలో మార్పులు కూడా ఆకలికి కారణం. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల ఆకలి పెరుగుతుంది. ప్రొజెస్టెరాన్ తక్కువగా ఉండటం కూడా ఆకలిని కలిగిస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ కార్టిసాల్. ఇది పీరియడ్స్ సమయంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

Also Read : Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cravings
  • More Hungry
  • periods cravings

Related News

Do you know what foods women should avoid eating during their periods?

Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం అనేది సహజం. ఈ పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కడుపునొప్పి తో పాటు నీరసంగా అనిపించడం, అలాగే శరీరంలో రకరకాల మార్పుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువ మందిని వేధించే సమస్య కడుపునొప్పి. ఈ నొప్పితో విలవిల్లాడుతుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, చాలా మంది తెలిసి తెలియక పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు త

    Latest News

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

    • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

    Trending News

      • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd