Debts : అప్పులు పెరగడంలో కీలక పాత్ర పోషించేవి ఇవే ..!! జాగ్రత్త
Debts : ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, చిన్న చిన్న ఆఫర్లను ఆసక్తిగా వెతుకుతూ షాపింగ్ చేయడం అనవసర ఖర్చులకు దారితీస్తుంది
- By Sudheer Published Date - 07:44 PM, Sun - 29 June 25

ఈ కాలంలో ఎంత ఆదాయం ఉన్నా, సరైన ఆర్థిక నియంత్రణ లేకపోతే అప్పుల భారం తప్పదు. మన జీవితశైలిలో కొన్ని అనవసర అలవాట్లు ఉన్నట్లయితే, అవే అప్పులు పెరగడానికి కారణమవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, చిన్న చిన్న ఆఫర్లను ఆసక్తిగా వెతుకుతూ షాపింగ్ చేయడం అనవసర ఖర్చులకు దారితీస్తుంది. ఈ ఖర్చులు కనపడకపోయినా, కొద్దికొద్దిగా చెల్లింపుల భారం పెరిగి, అప్పులు చేసేట్టుగా మారుతాయి.
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
ఇక అత్యంత ప్రమాదకరమైనది క్రెడిట్ కార్డుల వాడకంపై నియంత్రణ లేకపోవడమే. చాలా మంది కేవలం “మినిమం డ్యూ” మాత్రమే చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని వడ్డీతో కలిసి పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల అధిక వడ్డీలు, ఫైనాన్షియల్ స్ట్రెస్ తప్పదు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం కూడా ఊహించని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితికి నెడుతుంది. ఉదాహరణకి అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం రెడీగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సిందే.
ఇక మరొక ముఖ్యమైన అంశం.. అనవసర OTT సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం, చిన్న చిన్న ఖర్చులను లెక్కలో పెట్టకపోవడం, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా డబ్బును ఖర్చు చేయడం. ఇవన్నీ కలిసి మన ఆర్థిక భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపిస్తాయి. ప్రతి ఖర్చును ట్రాక్ చేయడం, అవసరమైనంతకు మించి వాడకపోవడం, తగిన సేవింగ్స్ చేసుకోవడం ద్వారా అప్పుల ఊబిలో పడకుండా మన ఆర్థిక జీవితాన్ని స్థిరంగా తీర్చిదిద్దుకోవచ్చు.