Thai Veg Noodles: థాయ్ వెజ్ న్యూడిల్స్.. ఇంట్లోనే చేసుకోండిలా?
మాములుగా మనం రకరకాల నూడుల్స్ తింటూ ఉంటాం. ఎగ్ నూడుల్స్, గోబీ నూడుల్స్ అంటూ రకరకాల నూడుల్స్ ని తింటూ ఉంటాం. అయితే ఎన్ని రకా
- By Nakshatra Published Date - 08:00 PM, Thu - 7 September 23
మాములుగా మనం రకరకాల నూడుల్స్ తింటూ ఉంటాం. ఎగ్ నూడుల్స్, గోబీ నూడుల్స్ అంటూ రకరకాల నూడుల్స్ ని తింటూ ఉంటాం. అయితే ఎన్ని రకాల నూడుల్స్ తిన్నా కూడా ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇష్టపడేది థాయ్ నూడుల్స్ అని చెప్పవచ్చు. ఆ న్యూడిల్స్ నోటికి భలే రుచిని ఇస్తాయి. అయితే మరి థాయ్ వెజ్ నూడుల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
థాయి వెజ్ నూడుల్స్ కావలసిన పదార్థాలు:
నూడుల్స్ – 200 గ్రా
కేరట్ – 1/2 కిలో
బీన్స్ – 1/2 కిలో
కాప్సికం – 1/2 కిలో
బేబీ కార్న్ – 1/2 కిలో
క్యాబేజి – 1/2 కిలో
మైదా – 50 గ్రా
కార్న్ ఫ్లోర్ – 100 గ్రా
సోయా సాస్ – 1 స్పూన్
వెనిగర్ – 1 స్పూన్
టొమాటో సాస్ – 1 స్పూన్
అజినోమాటో – చిటికెడు
పండుమిర్చి ముద్ద – 1 స్పూన్
పచ్చిమిర్చి – 5
ఉప్పు, నూనె – తగినంత
థాయి వెజ్ నూడుల్స్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా నూడుల్స్ ని ఉడకబెట్టి ఉంచుకోవాలి. తరువాత అన్ని కూరగాయల్ని పొడుగ్గా, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్ పండుమిర్చి ముద్ద ఉప్పు వేసి అందులో కూరగాయ ముక్కలన్నిటిని వేసి ఆ పిండికి పట్టించి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అందులో మైదా కార్న్ ఫ్లోర్ పట్టించిన కూరల్ని వేసి కరకరలాడేలా వేయించాలి. నూడుల్స్ ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన తరువాత ఒక నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనే వేసి పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, అజినోమాటో వేసి కాస్త వేగాకా అందులో కూరగాయముక్కల్ని వేసి 2 నిమిషాలు వేయించాకా చివరగా నూడుల్స్ ని కూడా వేసి వేయించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు.
Related News
Egg Noodles: నోరూరించే ఎగ్ నూడిల్స్.. పది నిమిషాల్లోనే తయారు చేసుకోండిలా?
ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో చేసిన వంటలకంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ లో పిల్లల నుంచి