Tea Water: జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరగాలి అంటే ఆ ఆకులతో ఇలా చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు తెల్లబడడం, చిట్లి పో
- By Anshu Published Date - 06:30 PM, Tue - 6 February 24

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు తెల్లబడడం, చిట్లి పోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసి విసిగిపోయి ఉంటారు. ఇక మీదట మీకు అంత శ్రమ అక్కర్లేదు. ఒక సింపుల్ రెమెడీని పాటిస్తే చాలు జుట్టు దృఢంగా ఒత్తుగా పెరగడం కాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
తలస్నానం చేసిన తర్వాత షాంపూ కండిషనర్ తో పాటు లైకోరైజ్ టీతో జుట్టును క్లీన్ చేయాలి. ఇది జుట్టు ఊడిపోవడానికి అరికడుతుంది. టీలో ఎన్నో రకాల కేఫిన్లు ఉంటాయి. ఇవి జుట్టు పొలికల్స్ ను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. గ్రీన్ టీ లాంటి టీలు ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని తగ్గించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టు చిట్లడం అనే సమస్యకు చెక్ పెడుతుంది. నలుపు లేదా ఆకుపచ్చ టీలో బయో ఆక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఈ విధంగా గ్రీన్ టీ జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే టీ లో ఐరన్, విటమిన్ ఈ లాంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఆకులను నీటిలో మరగబెట్టాలి. ఈ నీరు గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మొదటగా షాంప్ తో తలస్నానం చేసుకోవాలి. తర్వాత గ్రీన్ టీ వాటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత చేతులతో తేలిగ్గా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ టీ తో జుట్టుని కడగాలి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. టీ నీటీతో తో జుట్టు కడగడం వల్ల స్కాల్ప్ ఇన్ఫర్మేషన్ అరికడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. టీ లో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు హెల్త్ స్కాల్ప్ స్మూత్ హెయిర్ ని మెయింటెనెన్స్ చేయడంలో ఉపయోగపడతాయి..