Sweet Corn: స్వీట్ కార్న్ చాట్ ఇలా చేయండి
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ వర్షాలకు వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు వేడివేడిగా ఏదైనా చేసుకొ
- By Anshu Published Date - 08:30 PM, Sun - 30 July 23

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ వర్షాలకు వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలని అనుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే స్నాక్స్ మొక్కజొన్న. కొందరు ఉడకబెట్టుకుని తింటే మరికొందరు కాల్చుకొని తింటూ ఉంటారు. ఇంకొందరు స్వీట్ కార్న్ హాట్ కార్న్ అంటూ రకరకాల స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటారు. కొందరికి స్వీట్ కార్న్ ఎలా చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. మరి స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్వీట్ కార్న్ కి కావలసిన పదార్థాలు :
స్వీట్ కార్న్ – 2 కప్పులు
ఉల్లిపాయలు – 2
టమాటో – 3
పచ్చిమిర్చి – 1
కొత్తిమీర – కొన్ని
చాట్ మసాలా పొడి – 1/2 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/4 టేబుల్ స్పూన్
కారం – 1/4 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె లేదా బట్టర్ – 1 టేబుల్ స్పూన్
స్వీట్ కార్న్ తయారీ విధానం :
ఇందుకోసం తాజా స్వీట్ కార్న్ తీసుకొని మొక్కజొన్న గింజలను ఒలిచి వాటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత గింజలను ఉడికించుకోవాలి. మొక్కజొన్న గింజలు చక్కగా ఉడికిన తరువాత వాటిని ఒక గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర చల్లుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని ప్లేట్లలో సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి స్వీట్ కార్న్ రెడీ.