Super Healthy Foods: ఈ సూపర్ హెల్తీ ఫుడ్స్…పురుషుల్లో ఆ శక్తిని పెంచుతాయి..!!
శృంగారం ఓ మధురానుభూతి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆ మధుర క్షణాలను జీవితభాగస్వామికి అందించలేకపోతున్నారు పురుషులు.
- By Hashtag U Published Date - 07:20 AM, Sat - 28 May 22
శృంగారం ఓ మధురానుభూతి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆ మధుర క్షణాలను జీవితభాగస్వామికి అందించలేకపోతున్నారు పురుషులు. చాలామంది పురుషులు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. శృంగారం అనేది మనిషి ఆరోగ్యాన్ని పెంచే ఒక మంచి మెడిసిన్. కాబట్టి పురుషుల్లో సంభోగ శక్తిని పెంచేందుకు తీసుకోవల్సిన కొన్ని సూపర్ హెల్తీ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ హెల్తీ ఫుడ్స్ ను తీసుకుంటే…పురుషులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తొలగిపోతాయి. దీంతో జీవిత భాగస్వామికి సంపూర్ణమైన అనుభూతిని అందించగలరు. ఈ ఫుడ్స్ మీలోని శృంగార వాంఛలను పెంచి సంభోగ శక్తిని రెట్టింపు చేస్తాయి. పడక గదిలో సంపూర్ణమైన తృప్తిని మీ భాగస్వామితో కలిసి పొందుతారు.
గుడ్లు:
గుడ్లలో ప్రోటీన్స్, విటమిన్ బి5, బి6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో హార్మోన్ లెవెల్స్‌ను సమానస్థాయిలో ఉంచి ఒత్తిడిని దూరం చేస్తాయి. లైంగిక వాంఛలను పెంచుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకుంటే మీ శృంగార జీవితం సంపూర్ణంగా మారుతుంది.
అరటిపండు:
ప్రతిరోజూ అరటిపండు తింటే సంభోగ శక్తి పెరుగుతుంది. అరటిపండులో ఉండే సహజసిద్ధమైన బ్రోమెలిన్ అనే ఎంజైమ్ పురుషులలో శృంగార శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో లైంగిక కలయికలో ఎక్కువసేపు పాల్గొనేందుకు సహాయపడతాయి.
దానిమ్మ:
దానిమ్మలో ఉండే రసాయన సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. పురుషుల శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పురుషులలో ఆరోగ్యకరమైన వీర్య ఉత్పత్తికి సహాయపడుతాయి. ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ ను తీసుకుంటే శృంగార జీవితాన్ని పొందగలరు.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ అనే రసాయనం లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు లైంగిక కోరికలను పెంచుతుంది. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే శృంగరా స్థాయిని పెంచుకునేందుకు సహాయపడుతుంది.
అంజీరా పండు:
రెగ్యులర్ గా అంజీరాలను తీసుకుంటే పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా రెట్టింపవుతుంది. సంతానలేమి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజు అంజీర పండ్లను తీసుకుంటే పురుషుల్లో సంభోగ శక్తి పెరిగి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
Related News
Bananas: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ముఖ్యంగా వారికి..!
నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ఒకటి అధిక యూరిక్ యాసిడ్.