Beard growth Diet: గడ్డం ఒత్తుగా పెరగాలా.. అయితే ఇలా చేయండి.. గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం?
ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా వరకు అబ్బాయిలు గడ్డాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. గడ్డం ఎక్కువగా ఉన్నవారిని అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతూ
- By Anshu Published Date - 11:00 AM, Fri - 2 February 24

ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా వరకు అబ్బాయిలు గడ్డాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. గడ్డం ఎక్కువగా ఉన్నవారిని అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని అబ్బాయిలు కూడా గడ్డం నీకు కూడా పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా అబ్బాయిలకు గడ్డం మరింత అందాన్ని ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలకు పాతికేళ్లు వచ్చినా సరే ఇంకా సరిగా గడ్డం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. గడ్డం బాగా రావడం కోసం రకరకాల బ్రీడ్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఫలితం లభించదు. మరి గడ్డం బాగా ఒత్తుగా గడ్డి లాగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీరు నాన్ వెజిటేరియన్ అయితే గడ్డం పెరగడానికి ట్యూనా ఫిష్ తింటే మంచి ఫలితం ఉంటుంది. ట్యూనా ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ట్యూనా ఫిష్ తినడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుకల కుదుళ్లను తెరవడంలో ఇది సహాయపడుతుంది. మీరు మీ గడ్డం పెంచాలనుకుంటే ఖచ్చితంగా ట్యూనా చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంతో పాటు చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సోయాబీన్స్, స్టార్చీ బీన్స్, బఠానీలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గడ్డం పెరగడానికి వీటిని తింటే చక్కటి ఫలితం ఉంటుంది.
ఇవి శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీరుస్తాయి. అదేవిధంగా పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో పాలకూరతో కూరలే ఎక్కువగా చేస్తారు. కానీ పాలకూరను జ్యూస్‌లా కూడా తాగవచ్చు. జట్టు పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం లేకుండా చేస్తుంది. బచ్చలికూర జుట్టుకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఇది గడ్డం పెరగడానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి.
దానిని గడ్డానికి పట్టించాలి. ఇందులో ఉండే మినరల్స్ చర్మ రంధ్రాలను తెరవడంలో సాయపడతాయి. దాల్చిన చెక్కను తింటే జుట్టు మూలాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రసరణను పెరుగుతుంది. దాల్చిన చెక్కను ఉదయాన్నే గోరువెచ్చని నీరు, తేనెతో కలిపి సేవించవచ్చు. ఇది గడ్డం పెరగడానికి సహాయపడుతుంది.గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. గుమ్మడి కాయ గింజలు సూపర్ మార్కెట్లో లభిస్తాయి. వీటిని పొడి రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.