Soya Matar Curry: ఘమఘమలాడే సోయా మటర్ కర్రీ.. ఇంట్లోనే ట్రై చేయండిలా?
మామూలుగా మనకు ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏదైనా కూడా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త
- By Nakshatra Published Date - 09:15 PM, Mon - 4 December 23
మామూలుగా మనకు ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏదైనా కూడా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొత్తగా ఏం ట్రై చేయాలో తెలియక చాలామంది ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్న దాని ప్రాసెస్ ఎలాగా అన్నది కూడా తెలియదు. అయితే మీరు కూడా ఏదైనా కొత్త వంటకం ట్రై చేయాలనుకుంటున్నారా.. ఇంట్లోనే సోయా మటర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి?అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోయా మటర్ కర్రీ కావలసిన పదార్థాలు:
సోయా గ్రాన్యూల్స్ – 1 కప్పు
గ్రీన్ పీస్ – 1 కప్పు
పాలు – 1 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
టమాటో ప్యూరి – 2 స్పూన్స్
సన్నగా తరిగిన వెల్లుల్లి – 5 రెబ్బలు
సన్నగా తరిగిన అల్లం – 1 స్పూన్
పచ్చి మిర్చి – 4
కారం – 1/2 స్పూన్
ధనియాల పొడి – 1/2 స్పూన్
కొత్తిమీర – 1 కట్ట
నిమ్మరసం – 1 స్పూన్
గరం మసాలా – 1 స్పూన్
ఉప్పు – తగినంత
సోయా మటర్ కర్రీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని పాలల్లో ఒక గంట సేపు నానబెట్టాలి. అవి నానిన తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కాస్త రంగు మారాకా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిర్చి, టమాటా ప్యూరి వేసి టమాటా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత అందులో ధనియాల పొడి కారం తగినంత ఉప్పు వేసి కాసిన్ని నీళ్ళు పోసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆపై అందులో ఉడికించిన బఠానీలు వేసి అవి కూడా మగ్గాకా పాలల్లో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి ఆ పాలు కూడా పోసి కర్రీ మొత్తం దగ్గరయ్యే దాకా ఉంచాలి. దించే ముందు దానిలో గరం మసాలా, నిమ్మరసం కలిపి కొత్తిమీరతో అలంకరించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా మటర్ కర్రీ రెడీ.