Smart Phone: స్మార్ట్ ఫోన్ అడిక్ట్.. చిన్నారుల్లో కమ్యునికేషన్ నిల్
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో పోన్ లేనిదే రోజు గడవదు.
- Author : Balu J
Date : 24-08-2023 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో పోన్ లేనిదే రోజు గడవదు. సోషల్ మీడియా కారణంగా ఫోన్ వాడకం పెరిగింది. అంతేకాదు.. ఈ అలవాటు పిల్లల్లోనూ ఉంది. సంవత్సరం వయసున్న చిన్నారులకు ఫోన్ ని ఇస్తే వారిలో కమ్యునికేషన్, సమస్యా పరిష్కార నైపుణ్యం ఆలస్యమవుతాయని రెండునుండి నాలుగేళ్ల వయసులో ఈ ప్రభావం కనబడుతుందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది.
రోజుకి నాలుగు గంటలకు మించి ఫోన్, టీవీ, టాబ్, లాప్ టాప్ వంటివి చూస్తే… అంటే వారి స్క్రీన్ టైమ్ నాలుగు గంటలకు మించి ఉంటే వారిలో మెదడు అభివృద్ధి, శారీరక పెరుగుదల ఆలస్యమవుతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పిల్లల విభాగపు జర్నల్ లో ప్రచురితమైన నూతన అధ్యయనం వెల్లడించింది. పిల్లలు ఎన్నిగంటల పాటు స్క్రీన్ లను చూస్తున్నారు, వారిలో పెరుగుదల ఎలా ఉంది అనే వివరాలను తల్లుల ద్వారా తెలుసుకుని అధ్యయనం నిర్వహించారు.
రెండేళ్ల వయసులో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటల కాలం స్క్రీన్లతో ఉన్న చిన్నారుల్లో కమ్యునికేషన్, సమస్యా పరిష్కార నైపుణ్యాలు అలవడేందుకు అసలు సమయం కంటే మూడింతల ఎక్కువ సమయం పడుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఈ పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు, వస్తువులను చేతులతో పట్టుకోవటం, నడక, పరుగు లాంటి మోటార్ స్కిల్స్ తక్కువగా ఉండటం గమనించారు. నాలుగేళ్ల వయసు వచ్చేసరికి వారిలో ఆ లోపాలు చక్కబడినట్టుగా కనబడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పిల్లలకు ఫోన్ అలవాటు అయితే కంటి సమస్యలు కూడా వస్తాయి. వారు ఆరుబయట ఆడుకోకుండా నాలుగు గోడల మధ్య ఫోన్ చూస్తే ఎదుగుదల లోపించడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు.
Also Read: CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్