Beauty Tips: నెయ్యితో ఇలా చేస్తే చాలు ముఖంపై ఒక చిన్న మచ్చ కూడా ఉండదు?
ముఖంపై మచ్చలతో బాధపడేవారు నెయ్యితో కొన్ని ఫేస్ ప్యాక్ ని ట్రై చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Sun - 22 September 24

నెయ్యి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి నేరుగా తినడానికి ఇష్టపడని వారు స్వీట్లు రూపంలో ఆహారం వేసే రూపంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. కాగా నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. నెయ్యిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు అని చెబుతున్నారు. నెయ్యి ఫేస్ పాక్స్ వల్ల ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదట. ముఖం కూడా అందంగా మెరిసిపోతుందట.
నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. మరి నెయ్యితో ఫేస్ ప్యాక్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చర్మం మృదువుగా,తాజాగా ఉండాలి అనుకున్న వారు రెండు టీ స్పూన్ల నెయ్యిని, రెండు స్పూన్ ల శనగపిండిలో కలిపి పేస్టులా తయారు చేసి ముఖానికి అప్లై చేసే 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి,ఆ తర్వాత నెమ్మదిగా మసాజ్ చేస్తూ నీటితో శుభ్రం చేసుకోవాలట. ఈ విధంగా చేస్తే ముఖం మృదువుగా మారడంతో పాటు తాజాగా కనిపిస్తుందట. ఇకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం అన్నదే సహజం. ఈ ముడతలు కనిపించకుండా ఉండాలి అంటే అర టీ స్పూన్ నెయ్యిలో, అర టీ స్పూన్ తేనెను కలిపి ఫేస్ కి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు.
అదేవిదంగా అర టీస్పూన్ నెయ్యిని తీసుకుని అందులో కొద్దిగా పచ్చిపాలు, 2 టీస్పూన్ల శెనగపిండి కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇధి ఆరిన తర్వాత కొద్దిసేపు మసాజ్ చేసి చల్ల నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖంపై ఉన్న మచ్చలను పోగొట్టడానికి ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 1 నుంచి 2 సార్లు ముఖానికి అప్లై చేస్తే చాలు ముఖం మెరిసిపోవడం ఖాయం. అలాగే తేనె నెయ్యి ఈ రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ముఖంపై మొటిమలు మచ్చలు వంటి సమస్యలు పోతాయట.