Aloevera: కలబంద అప్లై చేస్తే జుట్టు జిడ్డుగా మారుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
కలబంద జుట్టుకి అప్లై చేస్తే జుట్టు సమస్యలు తగ్గడం సంగతి పక్కన పెడితే జుత్తు జుట్టుగా మారుతుందని అంటుంటారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:00 AM, Sat - 1 March 25

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే వివిధ రకాల బ్యూటీ ప్రోడక్ట్లలో కలబందను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కలబందతో కొన్ని రకాల పేస్ క్రీములు వంటి కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలామంది కలబందన జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు.
ఇలా అప్లై చేసినప్పుడు జుట్టు గా మారుతుందని కొంతమంది వాదిస్తూ ఉంటారు. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబంద మన ఆరోగ్యానికే మాత్రమే కాదు చర్మం, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. అందుకే చాలా మంది జుట్టును అందంగా, ఒత్తుగా మార్చడానికి, ఊడిపోకుండా కాపాడటానికి కలబంద జెల్ ను తలకు అప్లై చేస్తూ ఉంటారు. నిజానికి తలపై దుమ్ము పేరుకుపోవడం, శరీరంలో పోషకాలు లోపించడం వల్ల వెంట్రుకలు రెండుగా చీలిపోవడంతో పాటు రాలిపోతూ ఉంటాయి. అలాగే వెంట్రుకలు జీవం లేనట్టుగా కూడా కనిపిస్తాయి. అలాంటప్పుడు అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుందట.
కలబంద జెల్ జుట్టును దృఢంగా మారుస్తుందట. కానీ కలబంద జెల్ ను మోతాదుకు మించి ఉపయోగించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. కలబంద జెల్ ను తలకు అప్లై చేయడం వల్ల నెత్తి మీదున్న చుండ్రు పోతుందట. దురద కూడా తగ్గుతుందట. అయితే దీన్ని మోతాదుకు మించి నెత్తికి పెడితే కూడా తలపై దురద, బర్నింగ్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు కలబంద జెల్ ను తల మీద అప్లై చేయడం వల్ల నెత్తిమీద క్రస్ట్ లు ఏర్పడతాయని చెబుతున్నారు. కానీ వీటిపై మనం దృష్టి పెట్టం. దీనివల్ల ఇవి బాగా పెరుగుతాయట. ఇది మీ నెత్తి దెబ్బతినడానికి కారణమవుతుందట. కలబందను మరీ ఎక్కువగా వాడితే కూడా కొన్ని కొన్ని సార్లు జలుబు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కలబందలో చలువ చేసే గుణం ఉంటుందట. అందుకే దీన్ని ఎక్కువగా వాడితే జలుబు వస్తుందని చెబుతున్నారు. కలబందన జుట్టుకు అప్లై చేయడం మంచిదే కానీ ఎక్కువగా వాడితే మాత్రం జుట్టు జిడ్డుగా గా మారుతుందట.. జిడ్డుగల జుట్టు ఉన్నవారు కలబంద జెల్ వాడకపోవడమే మంచిది అని చెబుతున్నారు.