Chapathi: వామ్మో.. చపాతీలు రోజు తింటే అంత డేంజరా.. ఇది తెలిస్తే అస్సలు తినరు?
Chapthi: చపాతీలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ప్రతిరోజు తింటే మాత్రం కొన్ని రకాల సమస్యలు తలెత్తడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Thu - 25 September 25

Chapathi: చాలామంది చపాతీలను తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం చపాతీలను తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోవడంతో చాలామంది చపాతీలను ఎక్కువగా తింటున్నారు. అయితే చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ శృతిమించి, ప్రతిరోజు తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చపాతీలను ప్రతిరోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ సమస్యతో బాధపడేవారు అన్నానికి బదులుగా ఎక్కువగా గోధుమపిండి చపాతీలను తింటూ ఉంటారు.
వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనుకుంటూ ఉంటారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో చపాతీలు తింటే మాత్రం రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయట. గోధుమ చపాతీలో కూడా గ్లూటెన్ ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ లెవెల్స్ ను పెంచుతుందట. అందుకే డయాబెటీస్ ఉన్నవారు చపాతీలను రోజూ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడం కోసం అన్నానికి బదులుగా ఎక్కువగా చపాతీలను తింటూ ఉంటారు. ఇలా ఎక్కువగా తింటే వీటిలో ఉండే పిండి పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయట.
కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తక్కువగా తినడం మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు గోధుమపిండి చపాతీలను రోజు తినకపోవడం మంచిదని, లేదంటే ఇవి జీర్ణ సమస్యలను మరింత పెంచవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు గోధుమ చపాతీలను ఎక్కువగా, రోజూ తినకూడదట. ఎందుకంటే గోధుమలు కూడా హైపోథైరాయిడిజం సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజుకు మూడు లేదా నాలుగు చపాతీలను అస్సలు తినకూడదట.