Pomegrante Peel: దానిమ్మ తొక్కలతో తెల్ల జుట్టు నల్లగా మారుతుందా.. అందుకోసం ఏం చేయాలంటే!
దానిమ్మ తొక్కలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Wed - 23 April 25

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. తెల్ల జుట్టు అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది.. ఒక్కసారి రావడం మొదలు అయితే చాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెల్ల జుట్టు అలాగే వస్తూ ఉంటుంది. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా నల్ల జుట్టు వేస్తూ ఉంటారు. వీటి వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు. వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాల్సిందే.
ప్రతిరోజు వ్యాయామం చేయాలి. జుట్టు బలంగా ఉండాలంటే పండ్లు, ఆకు కూరలు తినాలని చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని నాచురల్ టిప్స్ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుందట. ఇందుకోసం ఒక్కసారి దానిమ్మ తొక్కల్లో మరికొన్ని పదార్ధాలు కలిపి ఇలా ట్రై చెస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుందట. దానిమ్మ తొక్కలు, ఆవాల నూనె, ఉసిరి పొడి కలోంజీ సీడ్స్, గోరింటాకు పొడి ఈ ఐదింటిని తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, అందులో దానిమ్మ తొక్కలు, కలోంజీ సీడ్స్ వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించాలి.తరువాత వీటిని మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో కప్పు ఆవాల నూనె, ఉసిరి పొడి, గోరింటాకు పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుందట. తెల్ల జుట్టుకు కూడా అద్భుతంగా పనిచేస్తుందట. ఇక ఆవాల నూనె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జుట్టుకు చక్కగా పనిచేస్తుందట. గోరింటాకు పొడి ఉసిరి పొడి జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో తోడ్పడతాయట.