Beauty Tips: అమ్మాయిల కోసం.. సమ్మర్ లో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి!
అమ్మాయిలు వేసవికాలంలో అందంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:34 AM, Wed - 12 February 25

నెమ్మదిగా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మార్చి నెల రాకముందే అప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బాలుడు తన తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండాకాలం వచ్చింది అంటే చాలా మంది స్కిన్ ని కాపాడుకోవడం కోసం తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటికి వెళ్లడం కోసం అమ్మాయిలు చాలా రకాల జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటారు. డ్రై స్కిన్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ లో లభించే ఎన్ని బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడినా కొన్ని పద్దతులు పాటించకపోతే ఎటువంటి ఫలితం ఉండదట. చాలామంది తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులే వారి అందాన్ని తగ్గించడానికి కారణం అవుతాయని చెబుతున్నారు. అలాంటి తప్పులు చేయకుండా కచ్చితంగా ఈ చిట్కాలని అనుసరించాలని చెబుతున్నారు. చాలామంది రోజంతా పనిచేసి అలసిపోవడంతో రాత్రి సమయంలో కనీసం మొఖం కూడా శుభ్రం చేసుకోకుండా అలాగే పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. ఇలా చేస్తే అది చర్మానికి హాని కలిగిస్తుందట. ఈ మంచి పద్ధతి కాదని ముఖంపై ఉండే గ్లో మొత్తం పోతుందని చెబుతున్నారు.
అందుకే ఖచ్చితంగా రాత్రి పూట ముఖం కడుక్కోవాలట. ఎంత ఆలస్యమైనా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే చాలామంది వేసవిలో నీటిని తక్కువగా తాగుతూ ఉంటారు. దానివల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలతో పాటు అందానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. డిహైడ్రేషన్ బారిన పడిన వారి చర్మం నిగారింపును కోల్పోతుంది. అలాగే నీళ్లు తక్కువగా తాగడం వల్ల దురద, చర్మం బిగుతుగా మారడం జరుగుతుందట. మీరు తగినంత నీరు తాగితేనే ముఖంపై కాంతి ఉంటుందట..లేదంటే పాలిపోయి చూడటానికి అంద విహీనంగా కనిపింస్తుందని చెబుతున్నారు. అందుకే కచ్చితంగా ఎక్కువగా నీరు తీసుకోవాలని దీనివల్ల అందానికి సంబంధించిన కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా రావు అని చెబుతున్నారు. అలాగే అందరికీ సంబంధించిన సమస్యలు రాకూడదు అనుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ను అప్లై చేయాలట. ఇందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు..
అరటిపండును మెత్తగా చేసి ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. అరటి ప్యాక్ లు కూడా తయారు చేయవచ్చు. దీని కోసం, 1 పండిన అరటిపండు, 1 టీస్పూన్ తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే అరటి మచ్చల నుండి ఉపశమనం లభిస్తుందట.
మరొక రెమిడి విషయానికొస్తే.. కొబ్బరి 2 స్పూన్, పచ్చి పాలు, 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి 1 స్పూన్, కొంచం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కొద్దిసేపు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది రంగును క్లియర్ చేస్తుందట.
ఇకపోతే మరో చిట్కా విషయాన్ని వస్తే.. బాదం ఆయిల్ ప్యాక్ 1 టేబుల్ స్పూన్ గ్రామ్ పిండిలో 1 టీ స్పూన్ బాదం నూనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖం మెడపై అప్లై చేసి వృత్తాకార కదలికలో మసాజ్ చేయాలి. కొంతసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుందట.