Lighten Dark Elbows: మోచేతులు, చంకల్లో నలుపుదనం పోవాలంటే ఈ 4 చిట్కాలు పాటించాల్సిందే?
మాములుగా శరీరం అంత తెల్లగా ఉన్నా కూడా మోచేయి, మోకాళ్ళు, చంకలు, మెడభాగం లాంటి బాగాలు చాలా మందికి నల్లగా ఉంటాయి. అయితే ఆ ప్రదేశాలలో ఉండే నలుపున
- By Nakshatra Published Date - 10:30 PM, Sun - 2 July 23
మాములుగా శరీరం అంత తెల్లగా ఉన్నా కూడా మోచేయి, మోకాళ్ళు, చంకలు, మెడభాగం లాంటి బాగాలు చాలా మందికి నల్లగా ఉంటాయి. అయితే ఆ ప్రదేశాలలో ఉండే నలుపును పోగొట్టుకోవడానికి అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్, హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా నలుపుధనం పోలేదని బాధపడుతూ ఉంటారు. అయితే నలుపుని, నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి అనేక కెమికల్స్, కెమికల్ ప్రోడక్ట్స్ ని వాడుతుంటారు. కొందరికి చంకలు కూడా నల్లగా మారిపోతాయి. వయస్సు పెరిగే కొద్ది ప్రతి ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తుంది. మరికొందరికి సూర్యరశ్మి వల్ల ఆ సమస్య వస్తుంది. మిగతా శరీర భాగాలతో పోలిస్తే మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మం పొడిగా, చాలా పలుచగా ఉంటుంది. అయితే మరి మోచేతులు, చంకల్లో నలుపుని ఏ విధంగా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆల్మాండ్ ఆయిల్.. రాత్రి సమయంలో పడుకునే ముందు కాస్త ఆల్మాండ్ ఆయిల్ రాసుకొని పడుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆల్మాండ్ పౌడర్ లో పెరుగును కలిపి పేస్టులా చేసి దాన్ని చర్మం పొడిగా ఉన్న చోట పూయాలి. రెండు వారాలపాటు రోజు విడిచి రోజు ఇలా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
కీరదోస…నిమ్మరసం, పసుపు, కీరదోస రసాన్ని మిశ్రమంగా చేసుకుని చంకల్లో రాయండి. ఇలా రోజూ రాసినట్లయితే.. నల్ల మచ్చ తొలగిపోతోంది.
కలబంద.. కలబంద చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై ఉండే మచ్చలను తొలగించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. కలబందలో ఉండే జిగురును నల్లగా ఉండే చోట రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల నలుపు మచ్చలు మాయం అవుతాయి.
నిమ్మ.. ఇందులో ఉండే విటమిన్-C మృత చర్మ కణాలను తొలగిస్తుంది. నల్లగా ఉండే మోచేతులు, మోకాలు భాగాల్లో నిమ్మరసం రాసి 20 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడిగేసి, తర్వాత ఏదైనా బాడీ లోషన్ రాసినట్లయితే కొద్ది రోజుల్లోనే మెరుగైన ఫలితం కనిపిస్తుంది.
Related News
Armpits Lightening Tips: చంకల్లో నలుపు ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
మామూలుగా శరీరం ఎంత తెల్లగా ఉన్నప్పటికీ శరీర భాగాల్లో ఒకటైన చంక భాగంలో నల్లగా ఉంటుంది. ఈ విషయం గురించి అబ్బాయిలు అంతగా పట్టించుకోక పోయి