Beauty Tips: అవాంచిత రోమాలతో ఇబ్బందిపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?
మహిళలకు అవాంచిత రోమాలు కనిపించడం అన్నది సహజం. కొందరిని ఈ సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ అవాంఛిత రోమాలు కూడా పె
- By Nakshatra Published Date - 10:30 PM, Wed - 13 September 23
మహిళలకు అవాంచిత రోమాలు కనిపించడం అన్నది సహజం. కొందరిని ఈ సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ అవాంఛిత రోమాలు కూడా పెరుగుతూ ఉంటాయి. దాంతో అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. అయితే మరి అటువంటి ఈ సమస్య వచ్చినప్పుడు ఇంట్లోనే వంటింటి చిట్కాలతో ఆ అవాంఛిత రోమాలను ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనెను అవాంఛత రోమాల మీద రాసి మెల్లగా మర్దన చేయాలి. ఆ తర్వాత మెత్తని శనగపిండిని రాసి నలుగు పెట్టాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే అవాంచిత రోమాలు తొలగిపోతాయి. అలాగే గుడ్డు తెల్లసొన లో ఒక స్పూన్ మొక్కజొన్న పిండి కలిపి మొఖానికి రాసి ఆరనిచ్చి ఆ తర్వాత నీటితో కడిగితే అవాంచిత రోమాలు త్వరగా పోతాయి. ఒక అరటిపండు గుజ్జు, రెండు చెంచాల ఓట్ మిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి కొద్దిసేపు ముఖానికి మర్దన చేయాలి ఆహారంలో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉండేలా చూసుకుంటే హార్మోన్ల సమస్య రాదు. ఆహారంలో అవిసె గింజలు, సోయా, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, వెల్లుల్లి, ఎండు ఖర్జూరం వంటివి ఉండేలాగా చూసుకోవాలి. అలాగే శనగపిండి, పసుపుని సమపాళ్లల్లో కలిపి ముఖానికి పట్టించిన తర్వాత నీటితో కడిగితే రోమాల పెరుగుదలని నియంత్రించవచ్చు.
అలాగే పాలలో పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్నచోట పట్టించి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే రోమాలన్నీ తొలగిపోతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు మొహానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే అవాంచిత రోమాల బెడద తగ్గుతుంది. అలాగే బియ్యం పిండిని, పెరుగుని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట అప్లై చేయాలి. తర్వాత కొద్దికొద్దిగా తడి చేస్తూ రుద్దుతూ రోమాలని తొలగించుకోవాలి.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త