Mushroom Manchurian: మష్రూమ్ మంచూరియన్.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?
మామూలుగా మనం మష్రూమ్స్ తో చాలా తక్కువ రెసిపీలు తిని ఉంటాం. అందులో పుట్టగొడుగుల వేపుడు, పుట్టగొడుగుల కబాబ్, పుట్టగొడుగుల మసాలా కర్రీ, పుట్టగ
- By Anshu Published Date - 06:00 PM, Mon - 15 January 24

మామూలుగా మనం మష్రూమ్స్ తో చాలా తక్కువ రెసిపీలు తిని ఉంటాం. అందులో పుట్టగొడుగుల వేపుడు, పుట్టగొడుగుల కబాబ్, పుట్టగొడుగుల మసాలా కర్రీ, పుట్టగొడుగుల బిర్యానీ అంటూ రకరకాల రెసిపీలు తినే ఉంటాం. ఈ రెసిపీలన్ని కూడా ఎక్కువగా మనకు ఫైవ్ స్టార్ అలాగే రెస్టారెంట్ లలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో మష్రూమ్స్ మంచూరియన్ కూడా ఒకటి.. మరి ఈ రెసిపీని రెస్టారెంట్ స్టైల్ లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మష్రూమ్ మంచూరియన్ కు కావాల్సిన పదార్థాలు:
మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు
మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్
పుట్టగొడుగులు – 250 గ్రాములు
వెల్లుల్లి పేస్ట్ – 1/2 స్పూన్
అల్లం పేస్ట్ – 1/2 స్పూన్
సోయా సాస్ – 1/2 స్పూన్
నూనె – వేయించడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 1 సన్నగా తరిగినవి
ఉల్లిపాయ – 1
ఉల్లిపొరక- 1 టేబుల్ స్పూన్
చిల్లీ సాస్- 1/2 టేబుల్ స్పూన్
టమోటా కెచప్ – 2 టేబుల్ స్పూన్లు
మష్రూమ్ మంచూరియన్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి, మొక్క జొన్నపిండి, అల్లం, వెల్లుల్లి పేస్టు, సోయాసాస్, ఉప్పు వేసి నీరు పోస్తూ కలపాలి. మీడియం మందపాటి పిండిని తయారు చేసి అందులో పుట్టగొడుగులు వేయాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడయ్యాక అందులో ఈ పుట్టగొడుగులను వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనెను వెడల్పుగా ఉన్న పాన్ లో వేసి సన్నని మంటమీద వేడి చేయండి. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయగనివ్వండి. అందులో సోయాసాస్, టొమాటో కెచప్, చిల్లా సాస్, ఉఫ్పు వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులు వేయాలి. ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియన్ రెడీ.