Men : మగవారు స్త్రీలతో ఎక్కువగా చెప్పే అబద్దాల గురించి మీకు తెలుసా?
కొంతంది మగవారు(Men) తమ భాగస్వామి ముందు వారి గురించి నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని అబద్దాలు చెబుతారు.
- Author : News Desk
Date : 04-01-2024 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
మన అందరం ఏదో ఒక సమయంలో అబద్దాలు(Lies) చెబుతాము. అయితే అబద్దాలు చెప్పడం వలన అప్పుడు ఉన్న పరిస్థితి నుండి బయట పడతారు. ఏదయినా అవసరానికి అబద్ధం చెప్పేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అబద్ధం ఆ సమయానికి మిమ్మల్ని రక్షించినా ఎప్పటికైనా నిజం బయటపడుతుంది. కొంతంది మగవారు(Men) తమ భాగస్వామి ముందు వారి గురించి నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని అబద్దాలు చెబుతారు.
మగవారు ఎక్కువగా రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఆకర్షితులు అయితే ఆ అమ్మాయితో మేము సింగల్ గా ఉన్నాము అని అబద్ధం చెబుతారు. స్త్రీలతో కలిసి మగవారు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక స్త్రీ అటుగా వస్తే ఆమె వైపు మగవారు చూస్తారు. స్త్రీలు ప్రశ్నిస్తే చూడడం లేదు అని నేను ఏదో ఆలోచిస్తున్నాను అని అబద్ధం చెబుతారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు లేదా పెళ్ళి అయిన వారు తమ భాగస్వామి దగ్గర ధూమపానం, మద్యపానం చేయము అని ప్రమాణం చేసి చెప్పి ధూమపానం చేయడం చేస్తారు. వారి వద్ద సిగరెట్ వాసన వచ్చినా, ధూమపానం చేసినా చేయలేదు అని అబద్ధం చెబుతారు.
మగవారు పెళ్ళి కాకముందు రిలేషన్ లో ఉన్నప్పుడు తమ వద్ద ఎక్కువ డబ్బు ఉందని అబద్ధం చెబుతారు. ఏ అమ్మాయి దగ్గర అయిన నేను ప్రేమలో పడిన మొదటి అమ్మాయి నువ్వే అని చెబుతారు. లేడీస్ లేట్ అంటారు కానీ ఒక్కోసారి మగవాళ్ళు కూడా ఐదు నిముషాలలో వస్తాము అని ఇంట్లో వాళ్లకి చెప్తారు, కానీ ఎప్పటికో వస్తారు. ఇక పెళ్ళైన వాళ్ళు భార్యళ్లకు రోజూ ఏదో ఒక విషయంలో అబద్దం చెప్తూనే ఉంటారట.
Also Read : Walking Vs Cycling : నడక మరియు సైక్లింగ్ ఏది ఎక్కువ ప్రయోజనకరం?