Ventilation Fan Vs Exhaust Fan : వెంటిలేషన్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మధ్య తేడా తెలుసా ?
Ventilation Fan Vs Exhaust Fan : మనం మోడర్న్ ఇళ్లలో సాధారణంగా రెండు రకాల ఫ్యాన్స్ కనిపిస్తుంటాయి.. సీలింగ్ ఫ్యాన్స్ అనుకునేరు.. అవి కాదు.. వెంటిలేషన్ ఫ్యాన్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. ఇప్పుడు మనం వాటి మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకోబోతున్నాం..
- By Pasha Published Date - 11:57 AM, Mon - 12 June 23

Ventilation Fan Vs Exhaust Fan : మనం మోడర్న్ ఇళ్లలో సాధారణంగా రెండు రకాల ఫ్యాన్స్ కనిపిస్తుంటాయి..
సీలింగ్ ఫ్యాన్స్ అనుకునేరు.. అవి కాదు..
వెంటిలేషన్ ఫ్యాన్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్..
ఇప్పుడు మనం వాటి మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకోబోతున్నాం..
వెంటిలేషన్ ఫ్యాన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏ పనిచేస్తాయి ? అనేది చాలామందికి తెలియదు. ఎలక్ట్రికల్ పని చేసే వాళ్ళను అడిగినా.. దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు.. ఈ రోజు మేం మీకు వెంటిలేషన్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేసే పని గురించి.. వాటి వల్ల మనకు కలిగే ఉపయోగం(Ventilation Fan Vs Exhaust Fan) గురించి చెప్పబోతున్నాం..
వెంటిలేషన్ ఫ్యాన్ అంటే ఏమిటి ?
ఇళ్ళు, దుకాణాలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలలో స్వచ్ఛమైన గాలి కోసం వెంటిలేషన్ ఫ్యాన్లను ఉపయోగిస్తారు. ఈ ఫ్యాన్లు ఇల్లు, కార్యాలయాల్లోకి స్వచ్ఛమైన గాలి ప్రవాహాన్ని నిర్వహిస్తాయి. దీంతో ఆఫీస్‌లో కూర్చున్న వారికి వాతావరణంలోని వేడి తగలదు. వెంటిలేషన్ ఫ్యాన్ ద్వారా గది, కార్యాలయ స్థలంలో స్వచ్ఛమైన గాలి ప్రసరిస్తుంది. ఈ కారణంగా శ్వాస తీసుకునేందుకు తాజా ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది.
Also read : 494 Crore Mansion : రూ. 494 కోట్ల ఇల్లు కొన్న స్టార్ కపుల్
ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏమిటి ?
ఇళ్లు, వాణిజ్య స్థలాల లోపలి నుంచి చెడు గాలిని బయటికి పంపడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగిస్తారు. బాత్‌రూమ్‌లు, కిచెన్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను వాడటాన్ని మీరు చాలా సార్లు చూసి ఉంటారు . ఎగ్జాస్ట్ ఫ్యాన్ కారణంగా బాత్రూమ్, వంటగదిలో ఉన్న తేమ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ్యాక్టరీలు, ఆఫీసుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను కొంచెం ఎక్కువ ఎత్తులో ఇన్‌స్టాల్ చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ కంటే తేలికైనది. దీన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు సేకరించి గదుల నుంచి బయటకు పంపుతాయి.
వెంటిలేషన్ ఫ్యాన్ .. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మధ్య తేడా ?
వెంటిలేషన్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు రెండు కూడా ఇళ్ళు, ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో స్వచ్ఛమైన గాలి కోసం పని చేస్తాయి. పర్యావరణాన్ని తాజాగా ఉంచుతాయి. గది నుంచి కలుషిత గాలిని తొలగించడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది. గదిలోకి స్వచ్ఛమైన గాలి ప్రసరణను పెంచడానికి వెంటిలేషన్ ఫ్యాన్ పనిచేస్తుంది.