Anti Aging food: ఈ ఆహారం తింటే చాలు.. వృద్ధాప్య ఛాయలు మటుమాయం?
ప్రస్తుత రోజుల్లో చాలామందికి యుక్త వయసులోనే వృద్యాప చాయలు కనిపించడంతో చాలామంది తెగ బాధపడుతూ ఉంటారు. వృద్ధాప్యం ఛాయలు రావడానికి కారణం ఒకటి
- By Nakshatra Published Date - 10:30 PM, Mon - 26 June 23
ప్రస్తుత రోజుల్లో చాలామందికి యుక్త వయసులోనే వృద్యాప చాయలు కనిపించడంతో చాలామంది తెగ బాధపడుతూ ఉంటారు. వృద్ధాప్యం ఛాయలు రావడానికి కారణం ఒకటి ఆహార పదార్థాలు కాగా రెండవది కాలుష్య రహిత వాతావరణం అని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల కారణాలు కూడా ఉన్నాయి. చిన్న వయస్సు లోనే వృద్ధాప్య ఛాయలు మన ముఖంపై కనిపిస్తున్నాయి. 30 ఏళ్లలోనే ముఖంపై ముడతలు, చర్మం నిస్తేజంగా మారడం, కళ్ల చుట్టూ ముడతలు, గీతలు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది ముఖంపై వృద్ధాప్య చాయలు పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు.
వీటితో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే వృద్ధాప్య ఛాయలు పోతాయి. ఆ ఆహార పదార్థాలు ఏవి అన్న విషయానికి వస్తే.. క్యారెట్.. ఇందులో లో బీటా కెరోటిన్, ఆరెంజ్ పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. బీటా-కెరోటిన్ సెల్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి దోహదం చేస్తాయి. క్యారెట్ మన డైట్లో చేర్చుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. ముడతలు రానీయవు కనుక వయసు మీదపడినట్లు అనిపించదు. ద్రాక్షలో రెస్వెరాట్రాల్, విటమిన్-సి ఉంటాయి. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా.
ద్రాక్షపండ్లలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల క్షీణతను తగ్గిస్తాయి. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయసు పైబడిన కొద్దీ శరీరంపై ముడతలు రాకుండా నివారిస్తాయి. ఆరంజ్‌లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మానికి కాంతిని ఇస్తాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.. మనం ప్రతిరోజూ వంటల్లో వాడే ఉల్లిపాయ కూడా యాంటీ ఏజింగ్ ఫుడ్‌లా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది.
అలాగే చర్మపోషణకు అవసరమైన మినరల్స్ కూడా దీనిలో మెండుగా ఉంటాయి. దీనిలోని పోషకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఉసిరి తరచుగా మన డైట్లో తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి యంగ్‌గా కనిపిస్తారు. అలాగే క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దీన్ని పచ్చిగా అయిన తినొచ్చు, లేదంటే కొంచెం ఉడికించి తిన్నా మంచిది.