Poisonous Seeds: ఈ పండ్ల గింజలు విషంతో సమానం..వీటిని తింటే ఇక అంతే సంగతులు?
Poisonous Seeds: సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి ఆహార పదార్థాలు పొరపాటు కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు.
- By Anshu Published Date - 09:30 AM, Thu - 20 October 22

Poisonous Seeds: సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి ఆహార పదార్థాలు పొరపాటు కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిదే కానీ కొంతమంది పండ్లతో పాటు వాటి లోపల ఉన్న విత్తనాలను కూడా తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లు మాత్రమే కాకుండా వాటి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలను మాత్రం అస్సలు తినకూడదు. మరి ఏ ఏ పండ్ల విత్తనాలు తినకూడదో..తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా వైద్యులు ప్రతిరోజు ఒక ఆపిల్ ను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆపిల్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వాటి గింజలు మాత్రంతినకూడదు. వాటి గింజలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. యాపిట్ గింజల్లో ఉండే సైనైడ్ కడుపులోకి వెళ్తే విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అది మరణానికి కూడా దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి.
అదేవిధంగా ఆప్రికాట్ విత్తనాలలో విషపదార్థా లైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటంతో పాటు, ప్రాణాల మీదికి వచ్చి చివరికి కోమాలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే పీచ్ విత్తనాలను తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. విత్తనాల్లో ప్రాణాంతకమైన సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి.