KFC Chicken: రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
కేఎఫ్సీ చికెన్.. ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియులు అయితే ఈ కేఎఫ్సీ చికెన్ అంటే పడి చచ్చిప
- By Nakshatra Published Date - 08:00 PM, Wed - 9 August 23
కేఎఫ్సీ చికెన్.. ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియులు అయితే ఈ కేఎఫ్సీ చికెన్ అంటే పడి చచ్చిపోతారని చెప్పవచ్చు. అయితే చాలామంది రెస్టారెంట్ లో, హోటల్స్ లో ఎక్కువగా ఈ కేఎఫ్సీ చికెన్ అని తింటూ ఉంటారు. కొంతమంది దీనిని ఇంట్లో ఏం చేయాలి అనుకున్నప్పటికీ ఎలా చేయాలో తెలీయక తెగ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు. రెస్టారెంట్ స్టైల్లో ఈ కేఎఫ్సీ చికెన్ చేయమని అడుగుతూ ఉంటారు. మరి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో కేఎఫ్సీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేఎఫ్సీ చికెన్ కు కావలసిన పదార్ధాలు:
చికెన్ ముక్కలు – 1/2 కేజీ
నూనె – ఫ్రై చేయడానికి తగినంత
గుడ్లు – 2
పాలు – 2 లేదా 3 చెంచాలు
మైదా – రెండు కప్పులు
గార్లిక్ పౌడర్ – 2 చెంచాలు
ఉల్లిపాయ పౌడర్ – 2 చెంచాలు
మిర్చి పౌడర్ – 1 చెంచా
ఓట్స్ పిండి – 2 చెంచాలు
సాల్ట్ – రుచికి తగినంత
నిమ్మరసం – 1 చెంచా
మిర్చి పౌడర్ – 1/2 టేబులు స్పూన్
పెప్పర్ పౌడర్ – 1/2 టేబులు స్పూన్
సాల్ట్ – తగినంత
కేఎఫ్సీ చికెన్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి వాటర్ డ్రై అవడానికి ఒక పేపర్ టవల్ మీద పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలో నిమ్మరసం, మిర్చిపౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి కలిపి ఈ మిశ్రమంలో చికెన్ వేసి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు గుడ్లు పగలగొట్టి పాలు పోసి మిశ్రమం మెత్తగా అయ్యేవరకు చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని దానిలో మైదాపిండి, గార్లిక్ పౌడర్, ఉల్లిపాయ పౌడర్, మిర్చీ పౌడర్, పెప్పర్ పౌడర్, బ్రెడ్ ముక్కలు, ఓట్స్, ఉప్పు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా నానపెట్టుకున్న చికెన్ ముక్కలను ముంచి మిశ్రమం ముక్కలకు మొత్తం అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తరువాత ఇప్పుడు చికెన్ ముక్కలను తీసుకొని వాటిని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పాలు గుడ్లు మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకూ ఉంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే దానిలో ఉన్న ఆయిల్ పీల్చుకుంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ చికెన్ రెడీ.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�