Hair Growth: పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ఖాయం!
Hair Growth: కేవలం పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇప్పుడు చెప్పినట్టు చేస్తే జుట్టు రాలడం తగ్గి పోవడంతో పాటు జుట్టు ఒత్తుగా గడ్డిలాగా గుబురులాగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Tue - 28 October 25
Hair Growth: ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టుకి సంబందించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, పలుచని జుట్టు, బట్టతల వంటి అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే అలా జుట్టుకి సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం పది రూపాయల పెరుగు ప్యాకెట్‌తోనే జుట్టుకు అవసరమైన పోషకాలు అందించి, రాలిపోయే జుట్టుని ఆపవచ్చట.
పెరుగులో విటమిన్ బి, కాల్షియం, ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి వెంట్రుకలను బలపరుస్తాయట. జుట్టును రూపుదిద్దేది కెరాటిన్ అనే ప్రోటీన్. పెరుగులో ఆ ప్రోటీన్ నిండుగా ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చుండ్రును తగ్గించడంలో సహాయం చేస్తుందట. జుట్టు మెరిసేలా, సున్నితంగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోవాలి. నేరుగా తలపై, జుట్టు రూట్ లపై బాగా అప్లై చేయాలి. 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే జుట్టుకి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి అని చెబుతున్నారు. 2 స్పూన్ల పెరుగులో 1 స్పూన్ ఉసిరి పొడి లేదా తాజా పల్ప్ రెండు కలిపి తలపై రాసి 45 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. జుట్టు నల్లగా, బలంగా పెరుగుతుందట. ఈ ప్యాక్ పొడి జుట్టు ఉన్నవారికి చాలా మంచిది. 2 స్పూన్ల కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి 3 స్పూన్ల పెరుగుతో కలపాలి. తలపై రాసి ఒక గంట తర్వాత కడగాలి. డ్రై హెయిర్ కు వైద్యం లాంటిదని చెప్పాలి. రోజుకి ఎక్కువ నీరు తాగాలి. పాలకూర, క్యారెట్, పప్పులు, గింజలు తరచూ తినాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎక్కువ కెమికల్ ఉత్పత్తులు దూరంగా పెట్టాలట.