House Decoration Items: మీ ఇంట్లో ఉండాల్సిన ఐటెమ్స్..!
మీ ఇంటిని అలంకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఆధునిక రూపాన్ని ఇష్టపడతారు, మరికొందరు సాంప్రదాయ రూపాన్ని ఇష్టపడతారు.
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Wed - 30 November 22

మీ ఇంటిని అలంకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఆధునిక రూపాన్ని ఇష్టపడతారు, మరికొందరు సాంప్రదాయ రూపాన్ని ఇష్టపడతారు. క్రింద కొన్ని ప్రసిద్ధ ఇంటి అలంకరణ ఆలోచనలు ఉన్నాయి:
షెల్ఫ్ (Shelf):
మీకు మీ ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులు ఇచ్చిన బుక్స్, గిఫ్ట్స్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటే ఇలాంటి షెల్ఫ్స్ కచ్చితంగా మీ ఇంట్లో ఉండాల్సిందే. ఇవి రకరకాల డిజైన్స్, రకరకాల కలర్స్‌లో దొరుకుతున్నాయి. కాబట్టి, మీ ఇంటి కలర్స్, డిజైన్స్‌కి తగినవి తీసుకుని అరెంజ్ చేయండి. వీటిని పెట్టి అందులో చిన్న చిన్న బుక్స్, గిఫ్ట్స్, చిన్న ప్లాంట్స్ ఇలా ఏవైనా పెట్టొచ్చు. అయితే వీనటి పెట్టిన ప్లేస్‌ని దృష్టిలో పెట్టుకుని వీటిని అరెంజ్ చేయాలి.
సి టేబుల్ (C Table):
సీ టేబుల్స్ కూడా ఓ మంచి ఆప్షన్. ఇవి చాలా కన్వీయెంట్‌గా ఉంటాయి. మీ ఇంటిని చాలా అందంగా మారుస్తాయి. ఇంట్లో తక్కువగా ఉండే ప్లేస్‌ని కూడా విశాలంగా కనిపించేలా చేస్తాయి. చిన్న ప్లేస్‌లో కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ టేబుల్స్‌ని మనం ల్యాప్‌టాప్ టేబుల్స్, కాఫీ టేబుల్స్ ఇలా వీటి కోసం వాడొచ్చు. అయితే కొనేటప్పుడు వాటి సామర్థ్యాన్ని, ఎంత బరువు హ్యాండిల్ చేయగలవో తెలుసుకుని కొనడం మంచిది.
డ్రింక్ టేబుల్ (Drink Table):
స్టైలిష్ లుక్‌తోనే ఎలిగెంట్గా కనిపించే డ్రింక్ టేబుల్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మీరు ఎలా అయినా వాడొచ్చు. వీటిపైన చెట్లు పెట్టడం వల్ల మరింత అందం కూడా వస్తుంది. వీటిని హాల్ మధ్యలో కిచెన్, గార్డెన్‌లో పెట్టి కాఫీ, టీ తాగినప్పుడు కొద్దిగా స్టైలిష్ గా కూడా వాడొచ్చు.
స్టడీ టేబుల్ (Study Table):
మీరు ఇంట్లోని మీ పిల్లల కోసం స్టడీ టేబుల్ కొనాలనుకుంటున్నారా, లేదా మీకే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కొనాలనుకుంటున్నారా. అయితే ఆ టేబుల్స్ పోశ్చర్ కూడా చాలా ముఖ్యం. దీంతో పాటు డిజైన్ స్టోరేజ్ కూడా చూసుకుని కొనడం మంచిది. అయితే, కొనేటప్పుడే మల్టీ పర్పస్ ఉందో లేదో తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు పిల్లలకోసం వేరేవి, పెద్దలకి వేరేలా ఉంటాయి. అలాంటివి సెలక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరికీ కూడా యూజ్ అయ్యే విధంగా అడ్జస్టేబుల్ ఉన్నది లేనిది చూసుకుని తీసుకోండి.
మల్టీ యుటిలిటీ స్టాండ్ (Multi-Utility Stand):
హ్యాండీ క్రాఫ్టెడ్‌లో దొరికే ఈ స్టాండ్ మీ ఇంటికి అందమైన లుక్‌ని తీసుకొస్తుంది. ఇవి ఇంట్లోని చెట్లు పెట్టడానికైనా, బుక్స్, ఇతర వస్తువులు స్టోర్ చేయడానికైనా ఇలా ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ఇందులో కూడా చక్కగా ఎన్ని ఐటెమ్స్ అయినా పెట్టుకోవచ్చు. వీటిని ఎక్కడైనా పెట్టొచ్చు. ఇంట్లో ఉండే ఎక్ట్స్‌ట్రా స్టఫ్ మొత్తం ఇందులో తోసేయొచ్చు. చక్కగా నీట్‌గా కూడా కనిపిస్తాయి.

Related News

Nidhi Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు..
Nidhi Aggarwal : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణు స్వామి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు, యాగం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది తమ కెరీర్ బాగా సాగేందుకు, సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కోసం నిధి అగర్వాల్ పూజలు ఈ చేసింది. వేణుస్వామిని కలిసి తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు, య�