Nose Hair: ముక్కులో వెంట్రుకలు కట్ చేస్తే అంత ప్రమాదమా? ఈ విషయాలు తెలుసుకోండి!
చాలావరకు ముక్కులో వెంట్రుకలు ఉండటం సహజం. అయితే ఈ వెంట్రుకలను కొందరు తమ అందం కోసం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు.
- By Nakshatra Published Date - 11:00 AM, Wed - 24 August 22
చాలావరకు ముక్కులో వెంట్రుకలు ఉండటం సహజం. అయితే ఈ వెంట్రుకలను కొందరు తమ అందం కోసం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు. కానీ అలా కట్ చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనంలో తెలిసింది. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల వాతావరణం లో ఏర్పడే దుమ్ము, దూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాలంలోకి.. ఆ తర్వాత శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి.
ఇక వెంట్రుకలను తొలగించడం వల్ల వాటి కుదుళ్లలో ఏర్పడే రంద్రాల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగి రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండటంతో పాటు మెదడుపై అధిక ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మరణానికి కూడా దారితీస్తుందని తెలిసింది. ఇక ముక్కు వ్యాక్సిన్ చేయించుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసింది.
నిజానికి ముక్కు వెంట్రుకలు మనం పీల్చుకునే గాలిని ఫిల్టర్ చేస్తాయి. గాలిలో ఉండే వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే క్రిముల నుండి ఈ వెంట్రుకలు కాపాడుతాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు చాలా సహాయపడతాయి. ముక్కుల్లో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, ఇతర బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి. కాబట్టి ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రావని.. ఇతర బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులకు రాకుండా సహాయపడుతుందని తెలుస్తుంది.
Related News
Nose Hair Removal: ముక్కులో వెంట్రుకలు పీకేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
చాలామంది ఈ ముక్కులో వెంట్రుకలు ఉండడం అన్నది అంద విహీనంగా భావించి వాటిని తొలగించేస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ముక్కులో ఉండే వెంటుకలు దుమ్మూదూళీ శ్వాస ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి. అయితే, కొందరికి ముక్కులో వెంటుకలు ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. దీంతో వాటిని పీకేస్తుంటారు. మరికొందరు ట్రి�