Black Hair: తెల్లజుట్టు నల్లగా మారాలంటే..ఈ ఆకుల రసం ట్రై చేయండి..!!
తెల్లజుట్టు...ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. వయస్సు సంబంధం లేకుండా జుట్టు తెల్లగా మారుతుంది.
- By Hashtag U Published Date - 08:15 AM, Wed - 1 June 22
తెల్లజుట్టు…ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. వయస్సు సంబంధం లేకుండా జుట్టు తెల్లగా మారుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ…జుట్టు తెల్లగా ఉంటే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలో తిరగాలన్నా..బయటకు వెళ్లాలన్నా..ఇబ్బందిగా అనిపిస్తుంది. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ డైలను ఉపయోగిస్తుంటారు. వీటి వాడకం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే జుట్టును సహజసిద్ధంగా నల్లగా మార్చుతుంది. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీకు బిళ్ల గన్నేరు మొక్కలు తెలిసే ఉంటాయి. ఇవి గులాబీ రంగు లేదా తెలుపు రంగులో పూలను పూస్తుంటాయి. అయితే గులాబీ రంగులో ఉండే బిళ్ల గన్నేరు మొక్క ఆకులను సేకరించాలి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి. వీటిలో ఉండే పలు బయోయాక్టివ్ సమ్మేళనాలు జుట్టుపై ప్రభావం చూపుతాయి. బిళ్లగన్నేరు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి…వాటి నుంచి రసాన్ని తీయాలి. రసం తీశాక…అందులో ఒక నిమ్మకాయ నుంచి రాసాన్ని తీసి కలపాలి.
ఆ మిశ్రమంలోనే ఒక టీస్పూన్ కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకుదుళ్లకు పట్టేలా మసాజ్ చేశారు. ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి చేస్తే…తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఇతర జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.
Related News
Food Tips : టైంకు తినకుంటే.. ఈ సమస్య కడుపుని ఇబ్బంది పెడుతుంది..!
ఈ రోజుల్లో, కడుపు సమస్యలు ప్రజలలో పెరుగుతున్నాయి, వాటిలో ఒకటి కడుపు పుండు.