Beauty Tips: కరివేపాకు ఉసిరి నూనె ఉపయోగిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు నల్లగా మారడం కోసం కరివేపాకు ఉసిరి నూనె ఉపయోగిస్తే నిజంగానే జుట్టు నల్లగా మారుతుందా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:33 PM, Mon - 5 May 25

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ తెల్ల వెంట్రుకలు కనిపించకూడదని వారానికోసారి కలర్ ను వాడుతూనే ఉంటారు. ఇంకొందరు నెలకు ఒకసారి కలర్ వేసుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు వేసినా అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత యధావిధిగా తెల్ల జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. తెల్ల జుట్టుకు నల్ల రంగు కు బదులుగా ఉసిరి, కరివేపాకుతో నూనును తయారుచేసి పెట్టుకుంటే మాత్రం మీ జుట్టుకు రంగు వేయాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు, ఉసిరికాయలు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని చెబుతున్నారు.
అలాగే కరివేపాకు, ఉసిరికాయలతో తయారు చేసిన నూనె జుట్టును బలంగా చేయడంతో పాటుగా తెల్ల జుట్టు, హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. ఇందుకోసం కరివేపాకును ఉసిరి పొడిలో వేసి బాగా కలపి ఈ పేస్ట్ లో కొబ్బరినూనె వేయాలట. తర్వాత ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. కరివేపాకు, ఉసిరికాయల నూనెను జుట్టుకు వేళ్ల సహాయంతో బాగా అప్లై చేయాలట. దీన్ని జుట్టుకు పట్టించి 2 గంటల పాటు అలాగే ఉంచాలట. ఆ తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. జుట్టు పొడుగ్గా ఉండాలని ప్రతిఒక్క మహిళకూ ఉంటుందట. కానీ చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. అయితే మీరు గనుక కరివేపాకు, ఉసిరి నూనెను జుట్టుకు పెట్టినట్టైతే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుందట.
ఈ రెండింటిలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయని దీన్ని ఉపయోగించడం వల్ల చిట్లిన వెంట్రుకలు తొలగిపోతాయని చెబుతున్నారు.
జుట్టు బలహీనంగా ఉంటే వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయట. అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయని, దీనికి ఉసిరి, కరివేపాకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అవును ఈ రెండూ జుట్టును ఒత్తుగా, బలంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయట. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతే జుట్టు పల్చగా అవుతుందట. అలాగే జుట్టు కూడా సస్నగా అవుతుందని చెబుతున్నారు. అయితే పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ నూనెను ఉపయోగించడం వల్ల మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుందని, ఇది మీ జుట్టును మూలాల నుంచి బలంగా చేస్తుందని చెబుతున్నారు.