Atukula Dosa : అటుకులతో దోసె ఎలా తయారుచేసుకోవాలో తెలుసా..?
అటుకుల(Poha)తో పాయసం, ఉప్మా, పోపు వంటివి చేసుకుంటూ ఉంటాము. అలాగే అటుకుల(Atukulu)తో దోసె తయారుచేసుకోవచ్చు.
- By News Desk Published Date - 09:00 PM, Sun - 13 August 23

అటుకుల(Poha)తో పాయసం, ఉప్మా, పోపు వంటివి చేసుకుంటూ ఉంటాము. అలాగే అటుకుల(Atukulu)తో దోసె తయారుచేసుకోవచ్చు. ఎప్పుడూ మనం రోజూ ఉప్మా, దోసె, ఇడ్లీ వంటివి కాకుండా కొత్తగా అటుకుల(Rice Flakes)తో దోసె తయారుచేయవచ్చు.
అతుకుల దోసె(Dosa) తయారీకి కావలసిన పదార్థాలు..
* ఒక కప్పు అటుకులు
* ఒక కప్పు బొంబాయి రవ్వ
* ఒక కప్పు పెరుగు
* తగినంత ఉప్పు
* ఒక కప్పు నీరు
*చిటికెడు బేకింగ్ పొడి
ఒక గిన్నెలో అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు కలిపి అరగంట సేపు ఉంచుకోవాలి. తరువాత కొద్దిగా నీరు పోసి మిక్సి పట్టాలి. దానిలో బేకింగ్ పొడి వేసి కలపాలి. దానిని దోసె పిండిలా జారుడు అయ్యేలా చేయాలి. ఇప్పుడు దీనితో పెనం మీద దోసెలా వేసుకొని కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. ఇలా తయారుచేసుకున్న అటుకుల దోసెకు అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Also Read : 1 Minute omelette : గుడ్డు లేకుండానే ఆమ్లెట్ తయారీ.. ఈ ప్రోడక్ట్ గురించి తెలుసా?