Banana Lassi: అరటిపండుతో టేస్టీగా ఉండే బనానా లస్సీ.. పిల్లలు అస్సలు వదలరు?
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి పండ్లు ఇష్టపడి తింటూ ఉంటారు. అరటి పండుతో తయారు చేసే ఎటువంటి పదార్థమైన కూడా ఇష్టంగా
- By Nakshatra Published Date - 08:00 PM, Fri - 21 July 23
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి పండ్లు ఇష్టపడి తింటూ ఉంటారు. అరటి పండుతో తయారు చేసే ఎటువంటి పదార్థమైన కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా అరటి పండుతో చేసే తీపి పదార్థాలు అంటే కొంతమంది లొట్టలేసుకొని మరి తినేస్తూ ఉంటారు. అయితే పిల్లలు పెద్దల కోసం ఎంతో టేస్టీగా ఉండే బనానా లస్సీ ఎలా తయారు చేయాలి? అందుకోసమే ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందా..
బానానా లస్సీ కి కావాల్సిన పదార్ధాలు:
అరటిపండు – 1
పంచదార – 2 స్పూన్లు
యాలకుల పొడి – కొద్దిగా
పెరుగు – 1 కప్
ఐస్ క్యూబ్స్ – కొన్ని
జీడిపప్పు – కొన్ని
బనానా లస్సీ తయారీవిధానం
ఇందుకోసం ముందుగా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. తాజా కమ్మనైన పెరుగును వాడితే లస్సీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి మిక్సర్ జార్ లోకి తీసుకోవాలి. ఒక కప్ తాజా పెరుగును కూడా అందులో వేసుకోవాలి. పంచదారను కాకుండా పంచదార పొడిని వాడితే జ్యూస్ లో బాగా కలిసిపోతుంది. అలానే యాలకులను కూడా మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు, పెరుగు ఉన్న మిక్సర్ జార్లో రెండు స్పూన్ల పంచదార పొడిని, నానబెట్టిన జీడిపప్పులను, చిటికెడు యాలకుల పొడిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.. అవసరమైతే నీటిని ఉపయోగించవచ్చు. అయితే, మరీ నీళ్లలా చేసుకుంటే జ్యూస్ రుచిగా ఉండదు. మంచి కన్సిస్టెన్సీ ని మెయిన్ టైన్ చేస్తే చూడటానికి, రుచికి రెండిటికి బావుంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని అందులో నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకుని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా జ్యూస్ ను ఇందులో పోసుకోవాలి. గ్లాసు పైన కొన్ని ఎండు ద్రాక్షలను పెట్టి డెకరేషన్ చేస్తే రెస్టారెంట్ లుక్ లో ఉండే ఎంతో రుచికరమైన బనానా లస్సీ రెడీ.
Related News
Bananas: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ముఖ్యంగా వారికి..!
నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ఒకటి అధిక యూరిక్ యాసిడ్.