Tips For Soft Hands: శానిటైజర్ ఉపయోగించి చేతులు రఫ్ గా మారాయా.. అయితే ఇలా చేయాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 12:30 PM, Sat - 24 February 24

కరోనా మహమ్మారి తరువాత శానిటైజర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రదేశాలలో ఈ హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే శానిటైజర్ ని ఉపయోగించిన తర్వాత మామూలుగా చేతులు ఆరిపోతూ ఉంటాయి. ఈ సమస్య చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటం అన్నది కొన్ని కొన్ని సార్లు కష్టమే. కేవలం శానిటైజర్ అని మాత్రమే కాకుండా సబ్బు వాడినా కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. శానిటైజర్ ని చేతి మీద వేసి ఉపయోగించినప్పుడు అది మాయిశ్చర్ మొత్తాన్ని తీసుకుంటుంది. దీనితో చేతులు డ్రై గా పగిలి పోతాయని వైద్యులు చెబుతున్నారు. మనం బయటికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాం.
అలాగే ఏదైనా పట్టుకున్నా, కూరగాయలు వగైరా వాటికి తీసుకొచ్చిన శానిటైజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు రోజుకు ఒక పది పదిహేను సార్లు వరకు మనం శానిటైజర్ చేసుకుంటూనే ఉంటాము. దీని వల్ల క్రిములు చచ్చి పోతాయి కానీ చేతులు మాత్రం పొడిబారిపోతాయి. దీనితో మనకి చేతులు పగిలిపోతాయి. పైగా ఇది మంట, నొప్పి వంటి వాటికి కూడా గురి చేస్తుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి వీలుంది. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్నికొస్తే.. కొన్ని కొన్ని సార్లు చాలా మంది ఈ డ్రై స్కిన్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ చేతులు డ్రై అయి పోకుండా ఉండాలంటే మీరు సులువైన ఈ చిట్కాలు పాటించచ్చు. పైగా ఇది పెద్ద కష్టం కాదు. ధర కూడా తక్కువే ఉంటుంది.
ఆమె ఏం చెబుతున్నారంటే? బటర్ లేదా కోకో బటర్ తో మీ చేతుల పై మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు అంటున్నారు. లేదు అంటే మీరు అలోవెరా ని కూడా ఉపయోగించ వచ్చు. దీంతో మీ చర్మం మెరుగు పడుతుంది లేదు అంటే మీరు విటమిన్ ఈ కానీ ఆరంజ్ ఎక్స్ట్రాక్ట్ ని కానీ ఉపయోగించవచ్చు. దీని వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. పైగా మంట తగ్గి పోతుంది. పగలడం కూడా తగ్గుతుంది. కనుక మీరు ఇటువంటి పద్ధతులని అనుసరించండి దీనితో మీకు తక్షణ మార్పు కనిపిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా మీరు వీటిని ఉపయోగించాలి. దీనితో సులువుగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. హోమ్ మాణిక్యూర్.. మనం ఈ పద్ధతిని అనుసరించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు సాధారణంగా మనం మానిక్యూర్ కి వెళుతూ ఉంటాం. ఆ టైప్ లోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ లో లభించే మానిక్యూర్ చేయడం మన వల్ల కాదు. కానీ ఈ మంచి ఐడియాని ఫాలో అయితే సులువుగా ఇంట్లోనే సెలూన్ లాగ మానిక్యూర్ చేసుకోవచ్చు అని ఆమె చెప్పారు.