Warts Treatment: పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా ఎలా తొలగించాలో తెలుసా?
మామూలుగా చాలామందికి పులిపిర్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి మెడ భాగం లేదా ముఖం భాగంలో ఎక్కువగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. పులిపి
- By Nakshatra Published Date - 05:18 PM, Tue - 23 January 24
మామూలుగా చాలామందికి పులిపిర్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి మెడ భాగం లేదా ముఖం భాగంలో ఎక్కువగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. పులిపిర్లు అందాన్ని పాడు చేస్తాయి. ముఖం మీద అంద వికారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలైతే పులిపిర్లతో చాలా బాధపడుతుంటారు. అయితే ఈ పులిపిర్లు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడం కోసం ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పాటు రకరకాల హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు.
శరీరంలో చెమట ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కడైతే శుభ్రత ఉండదో, ఆ ప్రాంతంలో చెమట వల్ల ఓ వైరస్ ఉత్పత్తి అవుతుంది. దాన్నే హ్యూమన్ పాపిలోమా అని అంటారు. అలా ఆ వైరస్ చర్మం మీద పెరుగుతూ పులిపిరిగా మారుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. మరి పులిపిర్లను శాశ్వతంగా తొలగించుకోవడం ఎలా అన్న విషయాన్ని వస్తే.. కొన్ని అవిసె గింజలను తీసుకొని వాటిని మొత్తగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. ఆ తర్వాత దానికి కాసింత తేనె కలిపి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత దాని చుట్టు చిన్న బ్యాండేజ్ వేయాలి. అలాగే ఆ బ్యాండేజ్ ను కొన్ని రోజుల పాటు ఉంచాలి.
కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాండేజ్ ను తీస్తే దానితో పాటు పులిపిరి కూడా రాలిపోతుంది. ఒకవేళ మీకు అవిసె గింజలు దొరక్కపోతే మన వంటింట్లో ఉండే వెల్లుల్లిని తీసుకోండి. వెల్లుల్లిని పేస్ట్ గా చేసి పులిపిర్ల మీద రాయాలి. వెల్లుల్లి పేస్ట్ ను రుద్దిన తర్వాత దాని మీద బ్యాండేజ్ వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా చేసుకొని వెనిగర్ లో వేసి రాత్రంతా వెనిగర్ లో ఉంచి ఉదయం లేచాక ఆ వెనిగర్ ను పులిపిర్ల పై రుద్దాలి. కర్పుర తైలం తీసుకొని దాని కూడా పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాలి.. ఆముదం అందుబాటులో ఉంటే దాన్ని కూడా అప్లై చేయవచ్చు. ఆలు గడ్డ కూడా పులిపిర్లను తొలగిస్తుంది. చిన్న ఆలు గడ్డ ముక్క తీసుకొని దాన్ని పులిపిర్ల మీద అప్లై చేయాలి.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త