Oily Skin: వేసవికాలంలో చర్మం జిడ్డుగా కనిపిస్తోందా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో చెమట అధిక వేడి కారణంగా ముఖం జిడ్డుగా కనిపిస్తుంది అనుకున్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:02 AM, Fri - 25 April 25

మామూలుగా వేసవికాలం మొదలయ్యింది అంటే చాలు చర్మానికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. వాటిలో జుట్టు చర్మం సమస్య కూడా ఒకటి. ఈ జిడ్డు చర్మం కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ హోం రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాగా మండే ఎండ నుంచి నీడలోకి వచ్చిన తర్వాత చర్మం కమిలిపోయినట్లు కనిపించడం లేదా కాస్త మంటగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో కొందరు చల్లని నీళ్లు ముఖం మీద చిలకరించుకుంటూ ఉంటారు.
అయితే దానికి బదులు క్లెన్సింగ్ మిల్క్ ని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంద. అలాగే ఎండాకాలంలో జిడ్డు చర్మం ఉంటుంది అనుకున్న వారు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదని అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఉత్పత్తులను ఎంచుకొవాలని చెబుతున్నారు. లేదంటే చర్మం ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా స్నానం చేసిన తరవాత లేదా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం సహజం. అయితే అందుకు ఉపయోగించే ఉత్పత్తులు కూడా జిడ్డుదనాన్ని ఎక్కువసేపు నివారించేలా ఉండాలట.
అప్పుడే మేకప్ ఎక్కువ టైం నిలిచి ఉంటుందని, లేదంటే మేకప్ వేసుకున్నా అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారు ఆయిల్ ఆధారిత ఉత్పత్తులకు కాస్త దూరంగా ఉండటం మంచిదట. అలాగే ఎండాకాలం తీసుకునే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలట. నూనె పదార్థాలు అధికంగా తీసుకుంటే సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు ఉంటాయట. కాగా బాగా పండిన ఒక అరటిపండు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులా రెండు చెంచాల ఓట్స్, చెంచా పాలు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి ప్యాక్ లా అప్త్లె చేసుకుని 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. కీరాదోస రసం, నిమ్మరసం కొద్దిగా తీసుకుని బాగా కలిపి, అందులో చిటికెడు పసుపు కూడా వేసి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్ లా వేసుకొని, 15 నుంచి 20 నిమిషాల సేపు ఆరిన తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ ను శుభ్రం చేసుకోవాలట. ఈ ప్యాక్ వల్ల ఫేస్ తాజాగా కనిపిస్తుందట.