Washing Machine : వాషింగ్ మెషిన్ క్లీన్‌గా ఉంచాలంటే, తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
రెగ్యులర్ గా క్లీన్ లేకపోతే వాషింగ్ మెషిన్ తొందరగా పాడవుతుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి మనం కొన్ని చిట్కాలను పాటించాలి.
- By News Desk Published Date - 10:00 PM, Thu - 6 July 23

ఈ రోజుల్లో అందరూ వాషింగ్ మెషిన్(Washing Machine) వాడుతున్నారు. అయితే దానిని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. కొంతమంది వాడగానే దానిని పట్టించుకోరు. రెగ్యులర్ గా క్లీన్ లేకపోతే వాషింగ్ మెషిన్ తొందరగా పాడవుతుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి మనం కొన్ని చిట్కాలను పాటించాలి.
ఒక కప్పు వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషిన్ లో వేసి పది నుండి పదిహేను నిముషాల పాటు వాషింగ్ మెషిన్ ను ఆన్ చేయాలి. డ్రై అయిన తరువాత ఒక పొడి క్లోత్ తో వాషింగ్ మెషిన్ టబ్ తుడవాలి. ఇలా చేస్తే వాషింగ్ మెషిన్ క్లీన్ గా ఉంటుంది.
ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్ లు అయితే ఫ్రంట్ డోర్ వద్ద నీళ్ళు నిలుస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదా డోర్ ని ఓపెన్ చేసి కొంచెం సమయం ఉంచితే నీరు నిలిచినా చోట పాకుడు పట్టకుండా ఉంటుంది.
డిటర్జెంట్ పొడి బాక్స్ లో సర్ఫ్ కొద్దిగా ఉన్నా అది అచ్చు లాగా మిగిలిపోయి దాని మీద పురుగులు చేరతాయి. కాబట్టి డిటర్జెంట్ పొడి బాక్స్ ను విడిగా బయటకు తీసి టూత్ బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు వాషింగ్ మెషిన్ క్లీన్ గా ఉంటుంది.
ఫిల్టర్ను అన్ బ్లాక్ చేయాలి లేకపోతే దానిలో కూడా పురుగులు చేరతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దానిని క్లీన్ చేసుకోవాలి.
వాషింగ్ మెషిన్ ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. గోడకు దగ్గరగా పెడితే వాషింగ్ మెషిన్ వెనుక ఉండే పైపులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
వాషింగ్ మెషిన్ లో ఎక్కువగా సర్ఫ్ కి బదులుగా లిక్విడ్ వాడితే మంచిది.
వాషింగ్ మెషిన్ అయిపోగానే డోర్ ఓపెన్ చేసి ఉంచాలి. అప్పుడు తేమ ఏమైనా ఉంటే పోతుంది, ఇంకా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
అలాగే వాషింగ్ మిషన్ ని వాడిన తర్వాతే క్లీన్ చేసుకుంటే మంచిది, ఆ టైంకి అలా వదిలేసి తర్వాత క్లీన్ చేద్దాం అనుకుంటే త్వరగా పాడైపోతుంది.
Also Read : Diabetes Symptoms : నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుందా.. అది మధుమేహానికి సూచన..!