Jaggery: బెల్లం కొంటన్నారా…అయితే స్వచ్ఛమైనదో కాదో ఇలా టెస్ట్ చేయండి..!!
బెల్లం...పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. బెల్లం ప్రతిసీజన్లో అమ్ముడవుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచేందుకు..శీతాకాలంలో ఎక్కువగా తినడానికి ఉపయోగిస్తుంటారు.
- By hashtagu Published Date - 10:00 AM, Fri - 22 July 22

బెల్లం…పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. బెల్లం ప్రతిసీజన్లో అమ్ముడవుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచేందుకు..శీతాకాలంలో ఎక్కువగా తినడానికి ఉపయోగిస్తుంటారు. చాలామంది చక్కరకు బదులుగా బెల్లంను వాడుతుంటారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మార్కెట్లో దొరికే బెల్లం స్వచ్చమైందా..కాదా..గుర్తు పట్టడం ఎలా. తెలుసుకుందాం.
ఐరన్, విటమిన్ సి:
బెల్లం రుచితో మాత్రమే కాదు…ఇందులో విటమిన్ సి,తోపాటు ఐరన్ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బెల్లం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దాని ప్రయోజనాలన్నింటినీ ఉపయోగించుకోగలరు. అయితే మీరు కొనే బెల్లం పూర్తిగా స్వచ్ఛమైనదని ఎలా తెలుసుకుంటారు. నిజానికి ఈరోజుల్లో వ్యాపారులు డబ్బు సంపాదన కోసం నకిలీ బెల్లం తయారు చేసి విక్రయిస్తున్నారు, ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి నాణ్యమైన బెల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం:
బెల్లం అనేది చెరకు నుండి తయారు చేయబడిన ఒక సూపర్ ఫుడ్. ఇది స్వీటెనర్. ఇది పచ్చి చెరకు రసాన్ని మరిగించి తయారుచేస్తారు. ఇది 20 శాతం చక్కెర, 50 శాతం సుక్రోజ్, 20 శాతం తేమ, వివిధ కరిగే పదార్థాలతో తయారు చేస్తారు. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, జింక్, ప్రోటీన్, విటమిన్ బి కారణంగా ఇది చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
వీటిని గుర్తుంచుకోండి:
1. సాధారణంగా నాణ్యమైన బెల్లం మంచి రంగు, మంచి రుచి, దృఢత్వం కలిగి ఉండాలి.
2. మీరు బెల్లం కొనుగోలు చేసినప్పుడల్లా, దాని రుచిని చూడండి. బెల్లం తీపి మాత్రమే రుచి చూడాలి. కాస్త ఉప్పగా అనిపిస్తే మీరు కొనే బెల్లం నకిలీదని అర్థం చేసుకోండి.
3. బెల్లం రుచి చూసినప్పుడు చేదుగా అనిపిస్తే, అది ఉడకబెట్టే ప్రక్రియలో పంచదార పాకం చేయబడిందని అర్థం.
4. బెల్లం స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి, దానిపై ఏవైనా స్పటికాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.
5. బెల్లం ఎంత గట్టిగా ఉంటే, దాని స్వచ్ఛతకు ఎక్కువ హామీ ఉంటుంది. చెరకును ఉడకబెట్టేటప్పుడు కల్తీ పదార్థాలు లేవని ఇది రుజువు చేస్తుంది.
బెల్లం రంగు:
స్వచ్ఛతను గుర్తించడానికి బెల్లం రంగు మంచి మార్గం. ఆదర్శవంతంగా బెల్లం రంగు ముదురు గోధుమ రంగులో ఉండాలి. కానీ మీరు కొనే బెల్లం పసుపు రంగులో కనిపిస్తే అది నిజం కాదు. దీని పసుపు రంగు రసాయనిక విలీనానికి సంకేతం. ఈ బెల్లం నీళ్లలో వేస్తే ఆ పాత్రలో కల్తీలు బయటపడతాయి. అలాగే స్వచ్ఛంగా ఉంటే అది పూర్తిగా నీటిలో కరిగిపోతుంది.