HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Home Remedy For Cracked Heel

Cracked Heel: పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి?

చాలామందిని సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో పాదాల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పాదాల సంరక్షణ కోసం ఎన్ని రకాల చిట్కాలు ప

  • Author : Anshu Date : 06-08-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cracked Heel
Cracked Heel

చాలామందిని సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో పాదాల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పాదాల సంరక్షణ కోసం ఎన్ని రకాల చిట్కాలు పాటించినప్పటికీ ఆ సమస్య తరచూ వేధిస్తూనే ఉంటుంది. ఇందుకోసం చాలా మంది స్త్రీ,పురుషులు హోమ్ రెమెడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ పాదాల పగుళ్ళ సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటి నొప్పి కారణంగా కొన్ని కొన్ని సార్లు రక్తం రావడం రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్‌ కూడా వస్తుంది.

వీటిని తగ్గించుకోవడానికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఇందుకోసం కొవ్వొత్తి మైనాన్ని ఆవనూనెతో కలిపి రాత్రిపూట పాదాల పగుళ్లపై రాస్తే. తెల్లవారే సరికి కొంత ఫలితం కన్పిస్తుంది. అలాగే గ్లిజరిన్‌ను రోజ్‌ వాటర్‌తో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు పాదాల పగుళ్లపై రాయాలి. అలా 15 రోజుల పాటు రాస్తే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా నిద్రించే ముందు పాదాలకు నువ్వుల నూనెను మర్ధన చేయడం కూడా మంచిదే. అరటిపండు గుజ్జు కూడా ఈ పగుళ్ల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తొందరగా మాన్పుతుంది.

పసుపు, తులసి , కర్పూరం సమాన మోతాదులో తీసుకుని, వీటికి అలోవెరా జెల్‌ కలిపి పాదాల పగుళ్లకు రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్ళతో బాధపడుతున్న వారు రోజూ నిద్రపోయే ముందు కొబ్బరి నూనె పాదాల పగుళ్ల భాగంలో బాగా పట్టించాలి. బాగా మర్ధనా చేయాలి. రోజులో పావుగంటసేపు పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి ఉంచాలి. తరువాత పగుళ్ల భాగంలో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు పోతాయి. పైనాపిల్ పండును మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును పాదాల పగుళ్ళపై రాసి 45 నిమిషాల పాటు వదిలేయాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్ల గుణాలు పగుళ్లలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిపోయేలా చేస్తాయి. పగుళ్లు కూడా తగ్గుతాయి. చర్మం గరుకుగా కాకుండా మృదువుగా మారతాయి. పాదాలకు రోజు మర్దన చేసుకుంటే రక్తప్రసరణ సవ్యంగా అవుతుంది. దీనివల్ల అక్కడ చర్మం పోషకాహారంతో నిండి పగుళ్లు రాకుండా ఉంటుంది. రోజులో కనీసం పావుగంటసేపు మర్దన చేసుకోవడం అవసరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cracked Heel
  • Cracked Heel problem
  • home-remedies

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd