Bowl Massage : బౌల్ మసాజ్ చేసుకోండి ఇలా.. అందాన్ని, ఆరోగ్యాన్ని పొందండి..
బౌల్ మసాజ్ చేయడం వల్ల ముఖానికి ఆరోగ్యంతో(Healthy Face) పాటు అందం(Beauty) కూడా వస్తుంది.
- Author : News Desk
Date : 29-09-2023 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
మనం ముఖం(Face) ఆరోగ్యంగా ఉండటానికి, ఎక్కువ ముడతలు పడకుండా ఉండటానికి, కాంతివంతంగా ఉండటానికి రకరకాల మసాజులు చేయడం, క్రీములు పూయడం వంటివి చేస్తాం. అయితే బౌల్ మసాజ్ చేయడం వల్ల ముఖానికి ఆరోగ్యంతో(Healthy Face) పాటు అందం(Beauty) కూడా వస్తుంది. బౌల్ మసాజ్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరినూనె లేదా ఫేస్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ గాని మన ముఖానికి రాసుకోవాలి.
తరువాత ఒక చిన్న స్టీల్ బౌల్(Steel Bowl) తీసుకొని దానితో మన ముఖం పైన నుదురు, కనుబొమ్మలు, మెడ, బుగ్గలు అన్ని చోట్ల నూనె మన చర్మంలోనికి ఇంకిపోయే విధంగా మర్దన చేయాలి. ఈ విధమైన మసాజ్ ను ఆయుర్వేద వైద్యంలో కూడా చేస్తారు. ఇలా బాడీ మొత్తం కూడా మసాజ్ చేస్తారు. ఆయుర్వేదంలో ఇత్తడి గిన్నెలను(Copper Bowl) మసాజ్ చేయడానికి వాడతారు. మన దగ్గర కూడా చిన్నవి ఇత్తడి గిన్నెలు ఉంటే అవే వాడుకోవచ్చు.
మన ముఖానికి బౌల్ మసాజ్ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు..
* ముఖం మీద ముడతలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి.
* మన చర్మం మృదువుగా తయారవుతుంది.
* రక్తప్రసరణ బాగా జరిగి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఎంతో రిలాక్సేషన్ గా కూడా ఉంటుంది.
* బౌల్ మసాజ్ వలన కండరాల మీద ఒత్తిడి తగ్గి విశ్రాంతి దొరుకుతుంది.
* బౌల్ మసాజ్ చేసుకోవడం వలన అలసట తగ్గుతుంది.
* నిద్రలేమి నుండి ఉపశమనం పొందవచ్చు.
* బౌల్ మసాజ్ వలన మన కంటి పనితీరు మెరుగుపడుతుంది.
* మన బాడీ మొత్తానికి కూడా బౌల్ మసాజ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వలన శరీర పనితీరును నియంత్రించే వాత, పిత్త, కఫ దోషాలు సక్రమంగా ఉంటాయి.
Also Read : Coconut : రోజూ కొబ్బరి ముక్క తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?