Skin Wrinkies : మీ ముఖంపై ముడతలు పోయి యంగ్ గా కనిపించాలి అంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖంపై ముడతలు,మచ్చలు మొటిమలు సమస్య కూడా ఒకటి. అతి చిన్న వయసులోనే
- By Anshu Published Date - 04:30 PM, Sun - 21 January 24

ఈ రోజుల్లో చాలామంది యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖంపై ముడతలు,మచ్చలు మొటిమలు సమస్య కూడా ఒకటి. అతి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చి వయసు ఎక్కువ వారిలా కనిపిస్తూ ఉంటారు. దాంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ముఖంపై మొటిమలు మడతలు సమస్యలను తగ్గించుకోవడానికి యంగ్ గా కనిపించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడంతో పాటు హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. మామూలుగా ముడతలు అనేవి వయసు మీద పడుతున్న కొద్ది వస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపించవచ్చు.
మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకు నేరేడు పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇవి కేవలం సీజన్లో మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. ఈ పండును తినడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు ముడతలు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకు అంటే ఈ నేరేడు పండును తినడం వలన రక్తం శుద్ధి జరిగి మేనిచాయ, నిగారింపు సంతరించుకుంటుంది. అయితే నేరేడు కేవలం అందానికే మాత్రమే కాదండోయ్ ఆరోగ్యంకు కూడా చాలా ప్రయోజనకరం గా ఉంటుంది. డయబేటిస్ ఉన్నవారు నేరేడు పండును తింటే రక్తంలో గ్లూకోజ్ ల స్థాయిలు తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ప్రతిరోజు ఆహరంలో నేరేడు పండును చేర్చడం ద్వారా రక్త పీడనం సమతులంగా ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పీచు పదార్ధం అధికంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ప్రేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా కాపాడుతుంది. నేరేడు పండులో విటమిన్ సి,ఐరన్,క్యాల్షియం,ఫాస్పరస్, మెగ్నిషియం, పోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలి తక్కువగా వేయడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో బరువు అదుపులో ఉంటుంది. నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి పోడి చేసి ఆ పోడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు తోలగిపోతాయి.