Pepper Benefits: ప్రతీ రోజు మిరియాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Pepper Benefits: ప్రతీ రోజు మిరియాలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:31 AM, Mon - 24 November 25
Pepper Benefits: ప్రతిరోజు మిరియాలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నల్ల మిరియాలలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుందట. వృద్ధాప్యం ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. మీరు సహజ పద్ధతిలో చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవాలనుకుంటే నల్ల మిరియాలు సహాయపడవచ్చట.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలు ముఖంపై వచ్చే సమస్యలను తగ్గిస్తాయట. చర్మానికి కూడా మెరుపు ఇస్తాయని చెబుతున్నారు. భారీ ఆహారం తిన్న తర్వాత తరచుగా కడుపులో భారంగా లేదా గ్యాస్ అనిపిస్తుందట. అటువంటి పరిస్థితిలో నల్ల మిరియాలు ఉపయోగపడతాయని, ఎందుకంటే ఇది కడుపులో ఆమ్లం ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరుస్తుందని దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. కాగా నల్ల మిరియాలలో ఉండే పైపరిన్ మెదడుకు కూడా మంచిద. ఇది మానసిక స్థితి, ఏకాగ్రత, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రసాయనాలను పెంచుతుందట.
ప్రతిరోజూ కొద్దిగా తీసుకోవడం వలన మానసికంగా చురుకుగా ఉంటారట. జలుబు లేదా శ్లేష్మం సమస్యలో నల్ల మిరియాలు ఉపశమనం కలిగిస్తాయట. దీని సహజమైన వేడి శ్లేష్మాన్ని వదులు చేయడానికి సహాయపడుతుందట. ఇది శ్వాస తీసుకోవడం సులభం చేస్తుందని, రద్దీ నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. నల్ల మిరియాలు జీవక్రియను కూడా వేగవంతం చేస్తాయట. పిపెరిన్ అనే మూలకం శరీర శక్తిని మెరుగుపరుస్తుందని, దీనివల్ల కేలరీలను బర్న్ చేయడం కూడా సజావుగా జరుగుతుందట. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం సులభం, ప్రయోజనకరంగా ఉంటుందట. కాలేయ ఆరోగ్యానికి కూడా నల్ల మిరియాలు సహాయపడతాయని చెబుతున్నారు. శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడానికి, కాలేయం పనితీరుకు మద్దతు ఇస్తుందట. దీని వలన శరీరం తేలికగా,ఆరోగ్యంగా అనిపిస్తుందట. నల్ల మిరియాలు రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయట. దీనివల్ల చిన్న చిన్న రోగాలు సులభంగా దరిచేరవని చెబుతున్నారు.