Palakura Idly: పాలకూర ఇడ్లీలో పోషకాలెన్నో.. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలామంచిది. ప్రతిరోజూ తింటే ఇంకా మంచిది. ముఖ్యంగా కంటిచూపుకు ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం. వాటిలో ఒకటి పాలకూర. దీనితో కూర, పప్పు, పాలక్ పన్నీర్ వంటి వంటలు తయారు చేసుకుంటారు.
- By News Desk Published Date - 07:22 PM, Thu - 28 December 23
Palakura Idly: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలామంచిది. ప్రతిరోజూ తింటే ఇంకా మంచిది. ముఖ్యంగా కంటిచూపుకు ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం. వాటిలో ఒకటి పాలకూర. దీనితో కూర, పప్పు, పాలక్ పన్నీర్ వంటి వంటలు తయారు చేసుకుంటారు. పాలకూరతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. అల్పాహారంగా పాలకూర ఇడ్లీ తింటే రోజంతా శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు.. అనేక వ్యాధుల్ని దూరంగా ఉంచుతాయి. మరి ఈ పాలకూర ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
పాలకూర ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర – 2 కట్టలు
పెసరప్పు – 1/2 కప్పు
పచ్చిమిర్చి – 1
పెరుగు – 1 స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
పాలకూర ఇడ్లీ.. తయారీ విధానం
పెసరపప్పును కడిగి గంటపాటు నానబెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 1/2 స్పూన్ నూనె వేసి.. అందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూరను వేసి.. పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి.
ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేయించిన పాలకూర, నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇడ్లీ వచ్చేలా పిండి ఉండేలా చూసుకోవాలి. గట్టిగా ఉంటే.. కొద్దిగా నీరు కలుపుకుంటే చాలు.
ఇడ్లీ పాత్రలకు నూనె రాసి.. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకుని ఉడికించుకోవాలి. పాలకూర ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ, సాంబార్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారు పాలకూర తింటే.. ఆ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోజూ పాలకూర తింటే.. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డీ జనరేటివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
Related News
Palak Biryani : పాలకూరతో బిర్యానీ.. ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
Palak Biryani : వారానికి ఒక్కసారైనా పాలకూర తింటే.. ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పినా.. రుచి నచ్చక తినేవారు తగ్గిపోయారు. అలాంటివారు పాలక్ బిర్యానీని ట్రై చేయండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది.