Gourd Benefits: పొట్లకాయ తింటే ఇన్ని లాభాల? వీటి రహస్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చాలామంది పొట్లకాయను తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. బహుశా అది చూడటానికి పాముల కనబడటంతో దానిని చూడటానికి కూడా ఇష్టపడరు కొందరు.
- By Anshu Published Date - 08:30 AM, Wed - 24 August 22

చాలామంది పొట్లకాయను తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. బహుశా అది చూడటానికి పాముల కనబడటంతో దానిని చూడటానికి కూడా ఇష్టపడరు కొందరు. కానీ పొట్లకాయను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ పొట్లకాయను తినకుండా దూరం పెట్టే వాళ్ళు మాత్రం ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోయినట్లే. ఇంతకు దానివల్ల ఉన్న లాభాలు ఏంటో తెలుసుకుందాం.
పొట్లకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కామెర్ల సమస్య ఉన్నవారు పొట్లకాయ జ్యూస్ ఒక స్పూను నిత్యము మూడుసార్లు తీసుకోవడం మంచిది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం, నీరు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, బి, సి, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.
ఇది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి. ఇక గుండెకి సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం వాటిని దరిచేరినీయవు. ఈ పొట్లకాయ రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
అంతే కాకుండా విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉండడంతో ఎముకలకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది. ఇక జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు ఈ పొట్లకాయ జ్యూస్ ని తలపై బాగా అప్లై చేసి 30 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన చుండ్రు జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. అలా పొట్లకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.