Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఒక్కటి రాస్తే చాలు.. వారంలోనే మాయం!
కంటికింద డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారం రోజుల్లోనే అవి మాయం అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు..
- By Anshu Published Date - 11:03 AM, Mon - 5 May 25

ఇటీవల కాలంలో అనేక రకాల కారణాల వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తున్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇవి తగ్గిపోవడానికి నేను ఫేస్ క్రీములు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల మనకు ఈ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. రావడం ఈజీ కానీ పోవడం మాత్రం చాలా కష్టం అని చెప్పాలి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన వంటింట్లో ఉండే వాటిలో బంగాళదుంప కూడా ఒకటి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కంటి కింది డార్క్ సర్కిల్స్ పై బంగాళదుంప రసం రాయడం వల్ల ఈజీగా తగ్గిపోతాయట. బంగాళాదుంపలు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ తో నిండి ఉంటాయని, ఇవి మీ చర్మానికి చాలా అవసరమైన పోషకాలను అందిస్తాయని చెబుతున్నారు. దీనిని కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయట.
అలోవెరా జెల్ కూడా ఎందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. డార్క్ సర్కిల్స్ ని తగ్గించడంలో ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట. కలబంద మన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుందని, కంటి కింద చర్మాన్ని మరింత మృదువుగా చేస్తుందని తద్వారా మంటను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ ఒత్తిడి లేకుండా, మీరు కళ్ల చుట్టూ అలోవెరా జెల్ ను సున్నితంగా మసాజ్ చేయవచ్చట. డార్క్ సర్కిల్స్ ని తగ్గించడానికి బాదం నూనె కూడా ఎంతో బాగా పనిచేస్తుందట. బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిని ఫాలో అవ్వడంతో పాటు టీవీలు ల్యాప్టాప్ లు మొబైల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తక్కువగా ఉపయోగించాలని వాటిని ఎక్కువసేపు అలాగే చూస్తూ ఉండకూడదని చెబుతున్నారు.