Mother’s Day 2022: అమ్మకు మరిచిపోలేని అనుభూతిని అందించండి..!!
అమ్మంటే మరో బ్రహ్మ కాదు...ఆ బ్రహ్మే మన అమ్మకు మరో జన్మ...!! అమితమైన ప్రేమ అమ్మ...అంతులేని అనుగారం అమ్మ...అలుపెరగని ఓర్పు అమ్మ..అద్భుతమైన స్నేహం అమ్మ...అపురూపమైన కావ్యం అమ్మ...అరుదైన రూపం అమ్మ.
- By Hashtag U Published Date - 02:32 PM, Fri - 6 May 22

అమ్మంటే మరో బ్రహ్మ కాదు…ఆ బ్రహ్మే మన అమ్మకు మరో జన్మ…!! అమితమైన ప్రేమ అమ్మ…అంతులేని అనుగారం అమ్మ…అలుపెరగని ఓర్పు అమ్మ..అద్భుతమైన స్నేహం అమ్మ…అపురూపమైన కావ్యం అమ్మ…అరుదైన రూపం అమ్మ. అమ్మ అనే పదంలోనే ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. తన కడుపులో నలుసు పడిననాటి నుంచి మొదలు తొమ్మిది నెలల పాటు ఎంతో సహనంతో..ఎన్ని అడ్డంకులను ఎదురైనా…తన రక్త మాంసాలను పంచి పునర్జన్మెత్తుకుంటుంది అమ్మ.
అమ్మ పడే పురిటినొప్పుల బాధ..బిడ్డ ఒడిలో పడగానే మర్చిపోతుంది. అందుకే ప్రతి మహిళా తన జీవితంలోఅమ్మా అనే మాట పిలుపు కోసం తాపత్రాయ పడుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుబంధం మాటల్లో చెప్పలేము. అమ్మ ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది జరుపుకునే రోజే మదర్స్ డే. అమ్మ త్యాగం..తనకంటే కోటిరెట్లు ఎక్కువని…భూదేవిని అడిగా చెబుతుంది. అమ్మ అంటేనే ఓర్పు…ఓర్పు అంటేనే అమ్మ. అందుకే ఈ జిందగీలో అమ్మే గొప్పది. తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…మే 8న ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మదర్స్ డేను జరుపుకోనున్నారు.
మదర్స్ డే సందర్భంగా అమ్మకు కానుకలు అందిద్దాం. అయితే మీరు అమ్మకు ఎలాంటి బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకుంటున్నారు…అయితే మీ కోసం మా దగ్గర కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
మొదటి కానుక :
మదర్స్ డే సందర్భంగా ప్రతిఒక్కరికి గుర్తొచ్చేది మంచి గిఫ్ట్. మీరు మీ అమ్మకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే…మార్కెట్లో ఎన్నో బహుమతులు అందుబాటులో ఉన్నాయి. కాఫీ మగ్స్, ఇయర్ రింగ్స్, ఫొటోఫ్రేమ్స్, మట్టి గాజులు వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. వీటితోపాటు మంచి గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వొచ్చు. అమ్మకు ఇచ్చే కానుక ఖరీదైనదా..లేదా…తక్కువ ధర ఉండేదా…ఇవేవీ ఏ తల్లీ పట్టించుకోదు.
అమ్మతో ఎక్కువ సమయం గడపడం :
ప్రస్తుతం ప్రతిఒక్కరూ బిజీలైఫ్ లో బిజీగా ఉంటున్నారు. ఉరుకుల, పరుగుల జీవితంలో కనీసం మదర్స్ డే రోజు మీ అమ్మతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేయండి. ఇలా చేస్తే మీ అమ్మకు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.
అమ్మకు విశ్రాంతినివ్వండి :
అమ్మ…నిద్రలేచింది మొదలు…రాత్రి పడుకునేంత వరకు విరామం లేకుండా పనిచేస్తుంది. చిన్నారులను ఉదయం పాఠశాలకు పంపేందుకు…పెద్దవారికి ఆఫీసుకు వెళ్లేందుకు టిఫీన్ రెడీ దగ్గర నుంచి..ఎన్నో టెన్షన్లు పడుతుంది అమ్మ. అమ్మకు కనీసం మదర్స్ డే రోజైనా విశ్రాంతి ఇవ్వండి. ఈ రోజు తనలో ఎలాంటి పనులు చేయించకండి.
అమ్మకు ఇష్టమైన వంటకం:
అమ్మ చేతి వంటి ఎప్పుడూ ప్రత్యేకమే..ప్రతిరోజూ అమ్మ మనకు వంటచేసి పెడుతుంది. కానీ అమ్మకు మాత్రం మదర్స్ డే రోజు మీరు వంట చేయండి. అమ్మకు ఇష్టమైన వంటకం ఏంటో తెలుసుకుని మీరే రెడీ చేయండి.
ఇంటిని అందంగా అలంకరించండి:
అమ్మ ఇంటిని పూదోటలా మార్చుతుంది. ఇంటిని కలర్ ఫుల్ గా ఉంచేలా ప్లాన్ చేయండి. అందమైన వస్తువులు…అరుదైన వస్తువులతో ఇంటిని అలంకరించండి. ఇలాంటివి చేస్తే అమ్మకు అద్భుతమైన సర్ ప్రైజ్ చేసినట్లుఅవుతుంది.
టూర్ ప్లాన్ చేయండి:
మీ అమ్మకు ఏ ప్రదేశం ఇష్టమో తెలుసుకోండి. అమ్మకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లడానికి వీలు కాకపోవచ్చు. కుటుంబ బాధ్యతల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అయితే మదర్స్ డే రోజు మీ అమ్మ మనసులో ఏముందో తెలుసుకుని…అమ్మకు తెలియకుండా సర్ ప్రైజ్ టూర్ ప్లాన్ చేయండి.
Related News

RGV Tweet: అమ్మా నేను మంచి కొడుకును కాదు…ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..!!
రామ్ గోపాల్ వర్మ...సంచలనాలకు మారుపేరు. ఆ పేరులోనే...ప్రత్యేకత ఉంది. ఏ విషయాన్నైనా సూటిగా...వివాదాస్పదంగా చెప్పడం ఆర్జీవీకి తప్పా ఇంకేవ్వరికీ రాదు.