Garlic Rice: ఎంతో స్పైసీగా ఉండే వెల్లుల్లి రైస్.. సింపుల్ గా ట్రై చేయండిలా?
మామూలుగా మనం తరచూ వెల్లుల్లి ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లి లేకుండా చాలా రకాల వంటలు పూర్తికావు. ఇవి కూరకు రుచిని పెంచడంతోపాటు మంచి ప్రయోజనాల
- By Anshu Published Date - 10:00 PM, Fri - 9 February 24
మామూలుగా మనం తరచూ వెల్లుల్లి ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లి లేకుండా చాలా రకాల వంటలు పూర్తికావు. ఇవి కూరకు రుచిని పెంచడంతోపాటు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వాసన కాస్త ఘాటుగా ఉండడంతో పాటు తిన్నప్పుడు కొంచెం కారంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి వెల్లుల్లితో ఎప్పుడైనా రైస్ చేసుకొని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే సింపుల్గా వెల్లుల్లి రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వెల్లుల్లి రైస్ కు కావలసిన పదార్థాలు :
ఒక కప్పు రైస్, వెల్లుల్లి , కరివేపాకు, మెంతి ఆకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఉద్దిపప్పు, పిల్లిలు, నిమ్మకాయ, ఉల్లిపాయ, నూనె, కొబ్బరి, ఉప్పు, పసుపు ఈ పదార్థాలన్నింటినీ కూడా తగిన మోతాదులో తీసుకోవాలి.
వెల్లుల్లి రైస్ తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా నూనె వేసి వేడయ్యాక అందులోకి అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కొద్దిగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. మిరియాలు, ఎండుమిర్చ, వేయించిన శనగపప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి అన్నం వేయాలి. నిమ్మరసం వేసి కలుపుకోవాలి. మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి బాగా తిప్పితే గార్లిక్ రైస్ రుచికి రెడీ. పిల్లులు ఎంతో ఇష్టంగా దీని తింటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.