Zodiac Signs: ఆ 4 రాశుల వాళ్ళు .. బ్రేకప్ తర్వాత కూడా లైఫ్ పార్ట్నర్ ను మర్చిపోలేరు!!
బ్రేకప్ ప్రక్రియ ఈజీగానే అయిపోవచ్చు గాక.. కానీ ఆ లైఫ్ పార్ట్నర్ తో ముడిపడిన జ్ఞాపకాలను ఈజీగా మర్చిపోలేం.
- By Hashtag U Published Date - 07:30 PM, Thu - 25 August 22
లైఫ్ పార్ట్నర్ కు బ్రేకప్ చెప్పడానికి మించిన బాధ మరొకటి ఉండదు.
బ్రేకప్ ప్రక్రియ ఈజీగానే అయిపోవచ్చు గాక.. కానీ ఆ లైఫ్ పార్ట్నర్ తో ముడిపడిన జ్ఞాపకాలను ఈజీగా మర్చిపోలేం. ముఖ్యంగా 4 రాశుల వాళ్లను ఈ తరహా జ్ఞాపకాలు నీడలా వెంటాడుతాయంట. వేధిస్తాయంట. ఆ నాలుగు రాశులు ఏమిటి ? వాటిని వెంటాడే బ్రేకప్ ఎమోషన్స్ ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
1.మీన రాశి..
మీనం అంటే చేప. మీన రాశిలో ఉన్నవాళ్లు బ్రేకప్ అయిన తర్వాత కూడా తమ పాత పార్ట్నర్ ను మర్చిపోలేరు. బ్రేకప్ అయిందనే విషయాన్ని కూడా మర్చిపోయి ..వీళ్ళు తమ ఓల్డ్ పార్ట్ నర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ చర్చలు జరుపుతారు. వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు.గతంలో తాము తొందరపాటులో బ్రేకప్ నిర్ణయాన్ని తీసుకొని ఉంటే.. దాన్ని కూడా వివరిస్తారు. ఎలాగోలా పాత పార్ట్నర్ ను మళ్ళీ కలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతారు. వాస్తవానికి ఈ రాశిలో ఉన్నవాళ్లు తమ జీవిత భాగస్వామిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మరీ భారీగా ఇద్దరి మధ్య గ్యాప్ వస్తేనే .. ఆ గ్యాప్ ఇక పూడ్చలేనిది అనే పరిస్థితుల్లో మాత్రమే బ్రేకప్ నిర్ణయాన్ని తీసుకుంటారు.
2.కర్కాటక రాశి..
కర్కాటకం అంటే ఎండ్రకాయ. ఈ రాశిలో ఉన్నవాళ్లు తమ లైఫ్ పార్ట్నర్ కు బ్రేకప్ చెప్పాల్సి వస్తే.. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అయితే ఈ ఎమోషన్స్ ను వీళ్ళు అందరి ముందు బయటపడనివ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే లోలోపల కుమిలిపోతుంటారు. బ్రేకప్ చెప్పిన పాత లైప్ పార్ట్నర్ వల్ల గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికి.. వాళ్ళను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇది ఈ రాశి వారి పరిపక్వ ఆలోచన దృక్పథానికి నిదర్శనం.
3.సింహ రాశి..
సింహరాశి అంటే పేరులోనే తెలిసిపోతుంది .. అది “సింహం” గుర్తుతో ముడిపడినది. ఈ రాశిలోని వాళ్ళు పైకి చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ బ్రేకప్ అయిన సందర్భంలో చాలా ఉద్వేగానికి గురవుతారు. అయితే ఆ ఉద్వేగం బయటకు తెలియకుండా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడంలో వీళ్ళు దిట్ట. ఇటువంటి సమయంలో వీరు తమ సన్నిహితుల నుంచి ఓదార్పును ఆశిస్తారు. ఎవరైనా వచ్చి తమను ఓదారుస్తారు అని ఆశగా ఎదురు చూస్తారు.
4. వృశ్చిక రాశి..
వృశ్చికం అంటే తేలు. ఈ రాశి వాళ్ళు తమ బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువను ఇస్తారు. తమ లైఫ్ పార్ట్నర్ తో కలిసి జీవితాంతం కలిసి జీవించడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో లైఫ్ పార్ట్నర్ కు బ్రేకప్ చెప్పాల్సి వస్తే.. ఈ రాశి వాళ్ళు తీవ్ర డిప్రెషన్ లో కూరుకుపోతారు.
చాలా బాధ నడుమ .. తమ లైఫ్ పార్ట్నర్ కు అల్ విదా చెబుతారు. ఈక్రమంలో ఎంతో కుమిలిపోతుంటారు. మానసిక వేదనను అనుభవిస్తారు.
Related News
Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ
Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది.