Beauty Tips: డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటిని తినాల్సిందే!
డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:37 PM, Mon - 2 December 24

ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో డ్రై స్కిన్ సమస్య కూడా ఒకటి. చర్మం డ్రై గా మారడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సరిగా నీరు తాగకపోవడం వల్ల కూడా చర్మం పొడి భారీ పగుళ్లు ముడతలు వంటివి వస్తూ ఉంటాయి. అందుకే ఎలాంటి సీజన్లో అయినా నీటిని బాగా తాగాలని చెబుతూ ఉంటారు. మీరు శరీరాన్ని హైడ్రెట్ గా ఉంచి స్కిన్ డ్రై నెస్ ను పోగుడుతుంది. అయితే స్కిన్ డ్రైనేజ్ పోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కీర దోసకాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఇవి కేవలం వేసవికాలంలో మాత్రమే కాకుండా మిగతా సీజన్ లలో కూడా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. కీరదోసకాయల్లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తింటే శరీరానికి తగినంత వాటర్ అందుతుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. అలాగే అవకాడోలో కూడా ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. డ్రైస్కిన్ ఉన్నవారికి ఇది ఎంతో సహాయపడుతుందని, ఇది చర్మ సమస్యలను కూడా పోగొడుతుందని చెబుతున్నారు. అలాగే తీపి బంగాళాదుంపలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. చిలగడదుంప శరీరాన్నే కాదు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.
బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కె, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మంపై ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యానికి ప్రధాన సంకేతం. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. అదేవిధంగా వాల్ నట్స్ ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ సమస్యలను తగ్గిస్తాయట. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి. అలాగే చర్మం కూడా అందంగా మెరిసిపోతుందని చెబుతున్నారు. డ్రై స్కిన్ సమస్యను పోగొట్టుకోవడానికి తినాల్సిన ఆహార పదార్థాలలో గుడ్డు కూడా ఒకటి.