Vastu Tips : కొత్త కారు కొంటున్నారా..?వాస్తు ప్రకారం ఎలాంటి కారు కొనాలో తెలుసుకోండి..!!
సాధారణంగా చాలామంది కారు కొనుగోలు చేసేముందు...వారికి నచ్చిన మోడల్, కలర్, మైలేజ్...వంటివి చూస్తారు.
- By hashtagu Published Date - 06:30 PM, Fri - 2 September 22

సాధారణంగా చాలామంది కారు కొనుగోలు చేసేముందు…వారికి నచ్చిన మోడల్, కలర్, మైలేజ్…వంటివి చూస్తారు. అవన్ని నచ్చితే కారును కొనుగోలు చేసేందుకు రెడీ అవుతారు. కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవారు వాస్తును కూడా నమ్ముతుంటారు. వాస్తు ప్రకారం ఎలాంటి కారును కొనాలి…ఏ కలర్ కొనాలి..ఇవన్నీ చూస్తుంటారు. ఎందుకంటే వాస్తు విషయంలో నిర్లక్ష్యం చేస్తే…ప్రతికూలత ఇస్తుంది. కొన్నిసార్లు వాహనం సరిగ్గా లేకుంటే ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే..మీరు కారును కొనుగోలు చేసే ముందు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
అదృష్ట రంగు:
మీ జాతకం ప్రకారం ఎలాంటి రంగు బాగుంటుందనేది జ్యోతిష్యులను అడిగి తెలుసుకోండి. మీ జన్మరాశి ప్రకారం ఏ రంగు అదృష్టమో ఆ రంగును ఎంచుకోండి. నలుపు లేదా తెలుపు వాహనాలు సాధారణంగా అందరూ తీసకుంటారు. కానీ ఎరుపు రంగును సెలక్ట్ చేసుకునేముందు మీరు జ్యోతిష్యుల సలహా తీసుకోండి.
మంచి పేరు:
కొంతమందికారుపై పేరు రాయిస్తుంటారు. దేవుడు పేరు పెట్టడం ఉత్తమం. లేదా మీరు మీ తల్లిదండ్రులు, పిల్లలు పేర్లు పెట్టవచ్చు. అంతేకానీ జనాన్ని ఆకర్షించేందు ఏది పడితే అది కారుపై రాయించకూడదు. ఇది వాస్తు ప్రకారం అంత మంచిది కాదు.
వీటిని గుర్తుంచుకోండి:
– విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులను వాహనంలో ఉంచకూడదు. కారును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
– పవిత్రమైన రోజున కొత్త కారు కొనండి. ముందుగా గుడిలో పూజ చేసి ఇంటికి తీసుకురండి. కొత్త కారులో దేవుడి విగ్రహం పెట్టుకోవడం మంచిది.
– చాలామంది కార్ డ్యాష్‌బోర్డ్‌లో చిన్న దేవుని విగ్రహాన్ని ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం గణేశుడి విగ్రహాన్ని ఉంచడం ఉత్తమం.
– కారులో చిన్న నల్ల తాబేలు బొమ్మను ఉంచితే మంచిది. ఇది వాహనం నుండి ప్రతికూలతను తొలగించడం ద్వారా సానుకూలతను పెంచుతుంది.
– వాహనంలో సహజ రాయి లేదా క్రిస్టల్ ఉంచడం వల్ల భూమి మూలకం బలపడుతుంది. ఇది ఎల్లప్పుడూ కారును సురక్షితంగా ఉంచుతుంది.
ఇంట్లో కారును ఎలా పార్క్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి?
– కారు గ్యారేజీని ఇంటికి ఆగ్నేయం లేదా వాయువ్య దిశలో నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. కారు గ్యారేజ్ వాయువ్య దిశలో ఉంటే, ఎక్కువ ప్రయాణాలు చేసే అదృష్టం ఉంటుంది.
– ఆగ్నేయ దిశలో పార్క్ చేసిన కారు రిపైర్లు పెడుతుంది. గ్యారేజ్ ఫ్లోర్ లెవెల్ ఉత్తరం లేదా తూర్పు వైపు వాలుగా ఉండాలి.
– కారు చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. ఒక వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా తిరగగలగాలి. ఈ గ్యాప్ కారు చుట్టూ కాంతి గాలి ప్రవహించేలా ఉండాలి.
– కారును తూర్పు లేదా ఉత్తరం వైపుగా పార్క్ చేయండి. ఇవి రెండూ అద్భుతమైన దిశలు. దీని వల్ల కారు ఇంజిన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దక్షిణ పడమర దిశల నుండి వచ్చే కిరణాలు కారుకు హాని కలిగిస్తాయి.
– కారు గ్యారేజీ గేటు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి.
– నీటిని సేకరించే సంప్ గుంత పైన కార్ పార్కింగ్ చేయరాదు. నీరు ప్రాణం. కారు డస్ట్, ఆయిల్ తదితరాలు నీటిలో పడి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.