Besan Flour : శనగపిండితోనే అందం.. ముఖం కాంతివంతంగా మారాలంటే..
ఇంట్లోని శనగపిండి(Besan Flour) తోనే ఫేస్ ప్యాక్స్ చేసుకొని మన ముఖాన్ని మరింత అందంగా చేసుకోవచ్చు.
- Author : News Desk
Date : 23-10-2023 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ రోజుల్లో ఎక్కువమంది ఆడవారు బ్యూటీ పార్లర్(Beauty Parlor) కు తప్పనిసరిగా వెళుతున్నారు. అయితే మన ముఖం కాంతివంతంగా మరియు తెల్లగా అవడానికి మన ఇంటిలో ఉండే వాటిని ఉపయోగించి మారవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే ఫేస్ ప్యాక్(Face Pack) ను ఉపయోగిస్తే మన ముఖంపైన ఉండే నల్లని మచ్చలు, మొటిమలు తగ్గి మన ముఖం తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది. ఇంట్లోని శనగపిండి(Besan Flour) తోనే ఫేస్ ప్యాక్స్ చేసుకొని మన ముఖాన్ని మరింత అందంగా చేసుకోవచ్చు.
శనగపిండిలో(Shanaga Pindi) ఉండే ఆల్కలీన్ స్వభావం మన చర్మం యొక్క ph స్థాయిలను కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. శనగపిండి మన చర్మం మీద ఉన్న మురికి, జిడ్డు వంటి వాటిని తగ్గిస్తుంది. శనగపిండి అనేది మనకు ఎక్సఫోలియట్ గా పనిచేస్తుంది. అంటే మన చర్మం పైన ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఒక స్పూన్ శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి మన ముఖానికి రాసుకొని ఒక అరగంట తరువాత చన్నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉండడం వలన మన చర్మాన్ని కాపాడుతుంది.
ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, కొద్దిగా పసుపు వేసుకొని దానిలో పాలు కలిపి దానిని మన ముఖానికి రాసుకొని పది నిముషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా చేయడం వలన మన ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. ఇలా ఇంట్లోనే ఉండే శనగపిండితో మన ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చుకోవచ్చు..